Urvashi Rautela: ఆ స్టార్ హీరో సినిమాలో ఊర్వశి రౌతేల.. స్పెషల్ సాంగ్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ ?..
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథానాయికలలో ఊర్వశి రౌతేల ఒకరు. హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌తో క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు తెలుగులోకి అరంగేట్రం చేయనుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ఊర్వశి స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల ది వారియరి చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో చిన్న బ్రేక్ తీసుకుని వెంటనే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల స్పెషల్ సాంగ్ చేయనుందట. ఈ పాట కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ జరుపుతారట. ఈనెల 26న వీరిద్దరి కాంబోలో రాబోయే ఐటెం సాంగ్ చిత్రీకరించనున్నారని.. మాస్ ప్రేక్షకులను ఈ పాట ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్.




ఇందులో రామ్ సరసన పెద్ది సందడి ఫేమ్ శ్రీలీలా కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీలో ఊర్వశి రౌతేల స్పెషల్ సాంగ్ చేస్తుండడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




