Mahesh Babu: నాట్యంతో అభిమానుల మనసు దొచుకున్న సితార.. కూతురి డ్యాన్స్ వీడియోతో మహేష్ దీపావళి శుభాకాంక్షలు..

నువ్వు నన్ను గర్వపడేలా చేయడంలో ఎప్పుడూ విఫలం కావు. మై లిటిల్ వన్. దీపావళి శుభాకాంక్షలు అంటూ సీతుపాప భారతనాట్యం చేస్తున్న వీడియోను షేర్ చేశారు మహేష్.

Mahesh Babu: నాట్యంతో అభిమానుల మనసు దొచుకున్న సితార.. కూతురి డ్యాన్స్ వీడియోతో మహేష్ దీపావళి శుభాకాంక్షలు..
Mahesh Babu, Sitara
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 24, 2022 | 2:26 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటూ.. ఫ్యామిలీ విషయాలే కాకుండా.. చిన్నారులకు అవసరమైన సమాచారాన్ని షేర్ చేస్తుంటుంది. చదువులోనే కాకుండా అన్నింటిలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తన స్నేహితురాలితో కలిసి ఏకంగా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందరితో శభాష్ అనిపించుకుంది. పాటలు.. డ్యాన్స్.. ఆటలు ఒక్కటేమిటి అన్నింట్లోనూ తన టాలెంట్ ను ప్రదర్శిస్తోంది. ఇప్పటికే సీతుపాప ప్రతిభను చూసి మహేష్ బాబు దంపతులు తెగ మురిసిపోతున్నారు.తాజాగా తన కూతురు శాస్త్రీయ నృత్యం చేస్తోన్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు మహేష్ బాబు. నువ్వు ఎప్పుడు గర్వపడేలా చేస్తావు అంటూ రాసుకొచ్చారు.

నువ్వు నన్ను గర్వపడేలా చేయడంలో ఎప్పుడూ విఫలం కావు. మై లిటిల్ వన్. దీపావళి శుభాకాంక్షలు అంటూ సీతుపాప భారతనాట్యం చేస్తున్న వీడియోను షేర్ చేశారు మహేష్. అందులో తన గురువు మహతి భిక్షుతో కలిసి అద్భుతమైన హావభావాలతో ఎంతో అందంగా నృత్యం చేస్తుంది సీతార. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సితార డ్యాన్స్ వీడియో చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ తర్వాత జక్కన్న దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.