AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: దీపావళి ట్రీట్ ఇచ్చేసిన మాస్ మాహారాజా.. ‘రావణాసుర’ రిలీజ్ డేట్ వచ్చేసింది..

రవితేజ చేస్తున్న చిత్రాలలో రావణసుర ఒకటి. డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని ఇభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.

Raviteja: దీపావళి ట్రీట్ ఇచ్చేసిన మాస్ మాహారాజా.. 'రావణాసుర' రిలీజ్ డేట్ వచ్చేసింది..
Raviteja
Rajitha Chanti
|

Updated on: Oct 24, 2022 | 2:41 PM

Share

మాస్ మాహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఖిలాడి చిత్రంలో అలరించిన ఈ హీరో శరవేగంగా తన తదుపరి చిత్రాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. రవితేజ చేస్తున్న చిత్రాలలో రావణసుర ఒకటి. డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని ఇభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇందులో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, సుశాంత్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.

వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 7న రావణాసుర థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ మాస్ మాహారాజా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో రవితేజ డిఫరెంట్ గా మాస్ లుక్‏లో కనిపిస్తున్నారు. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇందులో రవితేజ క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారని.. ఈ పాత్ర కోసం కొంత మంది లాయర్లను కలిసి వారి బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నారట. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమానే కాకుండా రవితేజ.. ధమాకా , టైగర్ నాగేశ్వరరావు చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ధమాకా చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మాహారాజా అతిథి పాత్రలో కనిపించనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మిథున రాశిలో రవి.. వారికి ప్రతి ప్రయత్నంలో విజయం..!
మిథున రాశిలో రవి.. వారికి ప్రతి ప్రయత్నంలో విజయం..!
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?