Tamannah: నానితో స్పెషల్ సాంగ్ చేయనున్న తమన్నా ?..

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం. అయితే ఈ పాటలో నాని సరసన మిల్కీబ్యూటీ తమన్నా స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది.

Tamannah: నానితో స్పెషల్ సాంగ్ చేయనున్న తమన్నా ?..
Nani, Tamannah
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 24, 2022 | 3:33 PM

శ్యామ్ సింగరాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని.. ఆతర్వాత వచ్చిన అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఇక ప్రస్తుతం న్యాచురల్ స్టార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం దసరా. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో నాని పక్కా ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. దీంతో ఈ చిత్రం కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో సందడి చేస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం. అయితే ఈ పాటలో నాని సరసన మిల్కీబ్యూటీ తమన్నా స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమన్నాతో చర్చలు జరుపుతున్నారని.. ఒకవేళ మిల్కీబ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. దసరా చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ హైలెట్ అంటున్నారు. నాని, తమన్నా కాంబో అదిరిపోతుందంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రంలో సాయి కుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!