AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

M S Subbulakshmi: సంగీత సరస్వతి మళ్లీ దిగొచ్చారా? ఎంఎస్ సుబ్బులక్ష్మిలా మారిపోయిన ప్రముఖ హీరోయిన్.. ఫొటోస్ వైరల్

తన గాన ప్రతిభకు ప్రతీకగా మన దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారీ లెజెండరీ సింగర్. వీటితో పాటు పద్మభూషణ్, రామన్ మెగసెసే అవార్డు, పద్మ విభూషణ్, కాళిదాస్ సమ్మాన్ వంటి ఎన్నో అత్యున్నత పురస్కారాలు ఆమె కీర్తి కిరీటంలో చేరాయి. 2004 డిసెంబర్ 11న 88 ఏళ్ల వయసులో సుబ్బు లక్ష్మీ కన్ను మూశారు. కానీ తన పాటల రూపంలో ఆమె ఎప్పటికీ సంగీత ప్రియుల హృదయాల్లో జీవించే ఉన్నారు

M S Subbulakshmi: సంగీత సరస్వతి మళ్లీ దిగొచ్చారా? ఎంఎస్ సుబ్బులక్ష్మిలా మారిపోయిన ప్రముఖ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
Bollywood Actress
Basha Shek
|

Updated on: Sep 17, 2024 | 11:24 AM

Share

తేనె కన్నా తీయనైన గానంతో భారతీయ సంగీతాన్నివిశ్వవ్యాప్తం చేశారు ప్రముఖ గాయని ఎంఎస్‌ సుబ్బులక్ష్మి. బాల్యం నుంచి తన చివరి శ్వాస వరకు సంగీతమే ఊపిరిగా బతికారామె. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతానికి సుబ్బు లక్ష్మి ఎనలేని సేవలు చేశారు. తన గాన ప్రతిభకు ప్రతీకగా మన దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారీ లెజెండరీ సింగర్. వీటితో పాటు పద్మభూషణ్, రామన్ మెగసెసే అవార్డు, పద్మ విభూషణ్, కాళిదాస్ సమ్మాన్ వంటి ఎన్నో అత్యున్నత పురస్కారాలు ఆమె కీర్తి కిరీటంలో చేరాయి. 2004 డిసెంబర్ 11న 88 ఏళ్ల వయసులో సుబ్బు లక్ష్మీ కన్ను మూశారు. కానీ తన పాటల రూపంలో ఆమె ఎప్పటికీ సంగీత ప్రియుల హృదయాల్లో జీవించే ఉన్నారు. సోమవారం (సెప్టెంబర్ 16) సుబ్బు లక్ష్మీ 106వ జయంతి సందర్భంగా సంగీతాభిమానులు ఆమెకు నివాళులు అర్పించారు. ఇదే క్రమంలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ విద్యా బాలన్ సంగీత సరస్వతిపై తన అభిమానాన్ని చాటుకుంది. అచ్చం‌ ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని తలపించేలా నాలుగు రకాల చీరల్లో ఫొటోషూట్‌ చేయించుకుంది. అనంతరం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి ఇలా రాసుకొచ్చింది.

‘నా చిన్నతనం నుంచి ఇప్పటివరకు ఉదయం నిద్ర లేవగానే వినిపించే శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలో సుబ్బులక్ష్మి గారి గొంతే వినిపిస్తుంది. ఆమె ఓ ఆధ్యాత్మిక శక్తి. ఆమెకు ఇలా నివాళులర్పించడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది’ అని ఎమోషనలైంది విద్యా బాలన్. ప్రస్తుతం ఈ ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అంతే కాకుండా ఈ లెజెండరీ సింగర్‌ బయోపిక్‌ మరోసారి తెర మీదకు వచ్చింది. ఎంఎస్‌ సుబ్బులక్ష్మి అంటే తనకు ఎంతో ఇష్టమని విద్యాబాలన్‌ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమెపై వినూత్నంగా అభిమానాన్ని చాటుకుంటూ దిగ్గజ గాయని పాత్రలో నటించాలనే తన కోరికను మరోసారి బయటపెట్టింది విద్యా బాలన్. మరి ఈ ప్రాజెక్టను ఎవరు తెరకెక్కిస్తారో చూడాలి. ఈ బయోపిక్ లో మహానటి కీర్తి సురేశ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఎం ఎస్ సుబ్బు లక్ష్మిలా విద్యా బాలన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.