Tollywood: భర్తతో విభేదాలు.. విడాకుల కోసం కోర్టుకు అలనాటి హీరోయిన్.. ?
ఊర్మిళ విడాకుల విషయం తెలిసి ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే వీరిద్దరు పరస్పర అంగీకారంతో విడిపోవడం లేదని.. కేవలం ఊర్మిళ మాత్రమే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని.. అందుకు గల కారణం మాత్రం తెలియరాలేదు.
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఊర్మిళ మతోంద్కర్ విడాకులు తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వీరిద్దరి డివోర్స్ గురించి అటు మీడియాలో, ఇటు ఫిల్మ్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. తన భర్త మోసిన్ అక్తర్ మీర్‌తో వివాహ బంధాన్ని ముగించుకోవాలని ఊర్మిళ నిర్ణయించుకుందని.. ఇప్పటికే ఆమె ముంబై కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుందని సమాచారం. అయితే ఈ విషయం గురించి ఊర్మిళ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.. కానీ నాలుగు నెలల క్రితమే ఊర్మిళ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఊర్మిళ విడాకుల విషయం తెలిసి ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే వీరిద్దరు పరస్పర అంగీకారంతో విడిపోవడం లేదని.. కేవలం ఊర్మిళ మాత్రమే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని.. అందుకు గల కారణం మాత్రం తెలియరాలేదు.
ఊర్మిళ చాలా సంవత్సరాలుగా సినీరంగంలో యాక్టివ్ గా ఉన్నారు. హిందీతోపాటు ఇటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. అప్పట్లో అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో తనకు మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. 2014లో ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా మేనకోడలు పెళ్లిలో ఊర్మిళ, మోసిన పరిచయమయ్యారు. కొద్దిరోజుల్లోనే వీరి పరిచయం ప్రేమగా మారింది. 2016లో ఊర్మిళ కాశ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త మోసిన్ అక్తర్ మీర్‌ను వివాహం చేసుకుంది. అతికొద్ది మంది సమక్షంలో వీరికి పెళ్లి జరిగింది. కానీ ఇప్పుడు వీరిద్దరి వైవాహిక బంధంలోకి చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఊర్మిళ విడాకులు తీసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. మోసిన్ కంటే ఊర్మిళ 10 ఏళ్లు పెద్ద. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు.
సినీరంగంలో తనదైన ముద్ర వేసిన ఊర్మిళ.. ఆ తర్వాత రాజకీయాల్లో చేరారు. 2019లో కాంగ్రెస్ లో చేరి ముంబాయి నార్త్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2020లో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలో శివసేన పార్టీలో చేరారు. ఇక మోసిన్ అక్తార్ కూడా నటుడే. 21 ఏళ్ల వయసులోనే కశ్మీర్ నుంచి ముంబయి వచ్చి పలు సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.