Bigg Boss 8 Telugu: సోనియా దెబ్బకు యష్మీ కన్నీళ్లు.. దోస్త్ కోసం నిఖిల్ పోరాటం.. సెకండ్ చీఫ్‏గా సీత..

నామినేషన్స్ తర్వాత నిఖిల్, పృథ్వీ మీ ఇద్దరిని అలా చూడలేదంటూ.. మీరు మాట్లాడాలి.. ఈజీగా మాటలు మాట్లాడేస్తుందని.. మదర్ సిస్టర్ అని చేసేదంతా నేను ఎందుకు నమ్ముతా అంటూ ఆ ఇద్దరితో మాట్లాడింది యష్మీ. దీంతో మధ్యలోకి వచ్చిన సోనియా.. మరోసారి యష్మీతో గొడవ పడింది. నువ్వు పృథ్వీ, నిఖిల్ ను మాత్రమే అబ్జర్వ్ చేస్తున్నావ్ అని సోనియా అనగా.. గేమ్ పరంగా చెప్పాను అంటూ వాదించింది యష్మీ.

Bigg Boss 8 Telugu: సోనియా దెబ్బకు యష్మీ కన్నీళ్లు.. దోస్త్ కోసం నిఖిల్ పోరాటం.. సెకండ్ చీఫ్‏గా సీత..
Bigg Boss 8 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 25, 2024 | 7:00 AM

బిగ్‌బాస్ సీజన్ 8లో నాలుగో వారం నామినేషన్స్ రచ్చ ఏ రేంజ్‏లో జరిగిందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సోనియా, యష్మీ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. నామినేషన్స్ తర్వాత కూడా వీరిద్దరి మధ్య ఫైట్ కొనసాగింది. సోనియా మాట్లాడే మాటలకు బోరున ఏడ్చేసింది యష్మీ. ఆ ఇద్దరినే చూస్తున్నావ్.. పృథ్వీ, నిఖిల్ ను మాత్రమే చూస్తున్నావ్.. ఇక నా ఆట ఎక్కడ కనిపిస్తుంది నీకు అంటూ ఇష్టమొచ్చినట్లు మాటలు అనేసింది. దీంతో యష్మీ కూడా గట్టిగానే వాదించింది. చివరకు కన్నీళ్లు పెట్టుకోవడంతో కిర్రాక్ సీత, నిఖిల్ ఓదార్చారు. నామినేషన్స్ తర్వాత నిఖిల్, పృథ్వీ మీ ఇద్దరిని అలా చూడలేదంటూ.. మీరు మాట్లాడాలి.. ఈజీగా మాటలు మాట్లాడేస్తుందని.. మదర్ సిస్టర్ అని చేసేదంతా నేను ఎందుకు నమ్ముతా అంటూ ఆ ఇద్దరితో మాట్లాడింది యష్మీ. దీంతో మధ్యలోకి వచ్చిన సోనియా.. మరోసారి యష్మీతో గొడవ పడింది. నువ్వు పృథ్వీ, నిఖిల్ ను మాత్రమే అబ్జర్వ్ చేస్తున్నావ్ అని సోనియా అనగా.. గేమ్ పరంగా చెప్పాను అంటూ వాదించింది యష్మీ.

అందరి పర్సనాలిటీ గురించి సోనియా మాట్లాడుతుందని.. గేమ్ ఆడకుండా వాళ్లిద్దరిని ముందుకు పంపిస్తుందని.. తప్పు తనదే అని అసలు ఒప్పుకోదంటూ ఫైర్ అయ్యింది. ఇక నీ ఫోకస్ మొత్తం వాళ్లి్ద్దరి మీదనే ఉంది.. పృథ్వీ, నిఖిల్ ను మాత్రమే చూస్తా్వ్ అంటూ మరోసారి రెచ్చగొట్టింది సోనియా. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఎమోషనల్ అయ్యింది యష్మీ. ఇక సోనియా అక్కడి నుంచి వెళ్లిపోయాక నిఖిల్, సీతతో మాట్లాడుకుంది కన్నీళ్లు పెట్టుకుంది యష్మీ. ఆమె ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుందంటూ కన్నీళ్లు పెట్టుకుంది యష్మీ. దీంతో నిఖిల్ ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. ఇక తర్వాత అర్దరాత్రి సోనియా, నిఖిల్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. సోనియాకు నిఖిల్ సారీ చెప్పగా.. నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశావ్ అంటూ డైలాగ్స్ కొట్టింది సోనియా. ఆమె నన్ను ఫేక్ బతుకు బతుకుతున్నావ్ అన్నది..వాళ్లను యూజ్ చేసుకుంటున్నావ్ అన్నది.. నీకు అప్పుడు అర్థం కాలేదు.. కానీ ఒక అనవసరమైన పాయింట్ చెప్పి మాట్లాడితే ఆమె నీకు కరెక్ట్ అనిపించింది.. ఇది నాలోనే దాచుకుంటా.. అంటూ ఎమోషనల్ అయ్యింది సోనియా.

సెకండ్ చీఫ్ గా సీత..

ఇవి కూడా చదవండి

ఇక నిన్న బిగ్‌బాస్ హౌస్ లో కాంతార టీంకు చీఫ్ గా ఎన్నిక జరిగింది. రెండో చీఫ్ ను ఎంచుకునేందుకు నిఖిల్ మినహా ప్రతి ఒక్కరు పోటిపడవచ్చు అని చెప్పాడు బిగ్‌బాస్ . టేబుల్ పై పది మంది బొమ్మలను పెట్టి వాటి ముందు సుత్తి పెట్టాడు. ముందుగా నిఖిల్ చీఫ్ కాబట్టి ఇందులో ఎవరు చీఫ్ గా అనర్హులని భావిస్తే ఆ మొదటి సభ్యుడి బొమ్మను పగలగొట్టాలని చెప్పాడు. రేసు నుంచి తప్పుకున్నవారు కూడా ఈసారి బజర్ మోగినప్పుడు నిఖిల్ తోపాటు సుత్తి కోసం పోటీపడాలి. ఆ సుత్తి వేరే సభ్యుడికి ఇవ్వాలని చెప్పాడు. ముందుగా నిఖిల్ ఆదిత్య బొమ్మను పగలగొట్టాడు. ఆ తర్వాత ఆదిత్య సుత్తి దక్కించుకుని పృథ్వీకి ఇవ్వడంతో మణికంఠను రేసు నుంచి తప్పించాడు. ఆ తర్వాత నిఖిల్ సుత్తిని దక్కించుకుని సీత చేతికి ఇచ్చాడు. దీంతో ఆమె యష్మీ బొమ్మను పగలగొట్టింది. ఆ తర్వాత మరోసారి నిఖిల్ చేతికే సుత్తి రాగా.. ఈసారి సోనియాకు ఇవ్వడంతో నబీల్ బొమ్మ పగలగొట్టి రివేంజ్ తీర్చుకుంది.

మరోసారి నిఖిల్ చేతికి సుత్తి రాగా.. ఈసారి నైనికకు ఇవ్వడంతో విష్ణుప్రియను రేసు నుంచి తప్పించింది. ఇక తర్వాత సుత్తి కోసం అందరూ ట్రై చేశారు. నిఖిల్, విష్ణుప్రియ ఒకే టైంలో సుత్తిని పట్టుకోగా.. మొదటగా విష్ణు పట్టుకుందని కాంతార టీమ్. కాదు నిఖిల్ అంటూ సోనియా వాదించారు. ఇద్దరు సుత్తిని లాక్కొవడానికి ట్రై చేయగా.. విష్ణుకు సపోర్ట్ గా నబీల్, మణికంఠ, యష్మీ వచ్చారు. దీంతో విష్ణు చేతికి సుత్తి రాగా.. ప్రేరణకు ఇచ్చింది. ఇక సోనియాను రేసు నుంచి తప్పించింది ప్రేరణ. ఆ తర్వాత మణికంఠ చేతికి సుత్తి రాగా.. నైనికకు ఇవ్వడంతో పృథ్వీ బొమ్మ పగలగొట్టింది. ఆ తర్వాత పృథ్వీకి సుత్తి దక్కించుకోవడంతో సీతకు ఇచ్చాడు. దీంతో నైనికను ఔట్ చేసింది. చివరగా సీత, ప్రేరణ మిగలడంతో ఈసారి నైనికకు సుత్తి ఇచ్చాడు. ఆమె ప్రేరణను తప్పించింది. దీంతో సెకండ్ చీఫ్ గా సీత నిలిచింది. ఆ తర్వాత సీత మాట్లాడుతూ.. నిఖిల్ కేవలం పృథ్వీ, సోనియా ఇద్దరి కోసమే ఆడుతున్నాడని.. నిఖిల్ వాయిస్ సచ్చిపోయిందని చెప్పేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.