AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun-Atlee: అల్లు అర్జున్‌తో పాన్ ఇండియా బ్యూటీ! అట్లీ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్‌!

పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ భారీ ప్రాజెక్టులో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.

Allu Arjun-Atlee: అల్లు అర్జున్‌తో పాన్ ఇండియా బ్యూటీ!  అట్లీ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్‌!
Allu Arjun
Basha Shek
|

Updated on: May 23, 2025 | 4:54 PM

Share

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సౌతిండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఒక ఫ్యూచరిస్టిక్ ఫాంటసీ మూవీ చేస్తున్నాడు. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ తరహాలో ఒక సూపర్ హీరో కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే అనేక ప్రసిద్ధ హాలీవుడ్ స్టూడియోలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రూపొందనుందని తెలుస్తోంది. అలాగే అల్లు అర్జున్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నారని సమాచారం. అందుకే అట్లీ సినిమాలో ఎక్కువ మంది హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆమె పాన్ ఇండియా బ్యూటీ దీపికా పదుకొణె. ఒకవేళ ఇదే నిజమైతే కల్కి తర్వాత దీపిక నటిస్తోన్న రెండు తెలుగు సినిమా అల్లు అర్జున్ దే అవుతుంది.

ఇవి కూడా చదవండి

కాగా కొన్ని నెలల క్రితమే తల్లి గా ప్రమోషన్ పొందింది దీపిక. దీంతో సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఆమెకు ఇప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే షారుఖ్ ఖాన్ సరసన ‘కింగ్’ సినిమాలో మహిళా ప్రధాన పాత్ర పోషించడానికి అంగీకరించింది దీపిక. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ‘స్పిరిట్’ సినిమాలో కూడా ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. అదే సమయంలో అల్లు అర్జున్ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పవచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుందని సమాచారం.

దీపిక పదుకొణె లేటెస్ట్ ఫొటోస్..

AA 22  అనౌన్స్ మెంట్ గ్లింప్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..