AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohanlal: గొప్ప మనసు చాటుకున్న నటుడు మోహన్ లాల్.. చిన్న పిల్లల కోసం కీలక నిర్ణయం

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బుధవారం (మే 21) తన పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. అయితే ఇదే శుభ సందర్భాన చిన్న పిల్లల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు మోహన్ లాల్.

Mohanlal: గొప్ప మనసు చాటుకున్న నటుడు మోహన్ లాల్.. చిన్న పిల్లల కోసం కీలక నిర్ణయం
Actor Mohanlal
Basha Shek
|

Updated on: May 22, 2025 | 7:56 PM

Share

మలయాళ సినీ నటుడు మోహన్ లాల్ ప్రస్తుతం వయసు 65 సంవత్సరాలు. అయితే ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాల్లో ఇంకా యాక్టివ్ గా మారుతున్నారు. కుర్ర హీరోలకు పోటీగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నారు. గత ఎనిమిది నెలల్లో మోహన్ లాల్ నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి, వాటిలో మూడు బ్లాక్ బస్టర్లు కాగా, ఒకటి సూపర్ హిట్. కాగా పుట్టిన రోజు సందర్భంగా బుధవారం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మోహన్ లాల్. తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రెండు గొప్ప కార్యక్రమాలను ప్రకటించారు. బేబీ మెమోరియల్ ఆస్పత్రితో కలిసి ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అర్హులైన పిల్లలకు తక్కువ ధరకే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను అందించనున్నట్లు మోహన్ లాల్ తెలిపారు. ‘ కేరళలో చాలా మంది పిల్లలు కాలేయ వ్యాధులతో బాధపడుతున్నారు. వారికి కాలేయ మార్పిడి అవసరం. అలాంటి కుటుంబాలకు సహాయం చేయడమే నా లక్ష్యం’ అని మోహన్ లాల్ చెప్పుకొచ్చారు. దీంతో పాటు తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘బి ఏ హీరో’ అనే పేరుతో యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ ను కూడా ప్రారంభిస్తున్నట్లు నటుడు తెలిపారు. సినిమాల్లో సూపర్ స్టార్ గా వెలుగొందుతోన్న మోహన్‌లాల్ 2015లో విశ్వశాంతి ఫౌండేషన్ స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో పేదల ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా, మోహన్ లాల్ బయోపిక్ రానుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆయన బయోగ్రఫీ రానుంది. మోహన్ లాల్ జీవిత విశేషాలను తెలిపే ఈ పుస్తకం పేరు ‘ముఖ్రగం’. ఈ ఏడాది డిసెంబర్ 25న ఈ పుస్తకం రిలీజ్ కానుంది. రచయిత భానుప్రకాష్ 2019 నుండి ఈ పుస్తకంపై పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాలేయ వ్యాధులతో బాధపడుతోన్న చిన్నారులకు..

నటుడు మోహన్ లాల్ స్వయంగా ట్విట్టర్ లో ఈ విషయాన్ని పంచుకుంటూ, “నా 47 ఏళ్ల సినీ ప్రయాణం ఈ పుస్తకంలో ఉంటుంది” అని అన్నారు. ఈ పుస్తకం 1000 పేజీల ఉంటాయని, తన జీవితంలోని ప్రతి అంశం ఇందులో ఉంటుందని మోహన్ లాప్ పేర్కొన్నారు. ఈ పుస్తకానికి ప్రఖ్యాత రచయిత వాసుదేవ నాయర్ ముందుమాట రాస్తారని కూడా నటుడు తెలిపారు.

యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ లో మోహన్ లాల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.