Naga Chaitanya: అప్పుడు మహేష్ బాబు మరదలు.. ఇప్పుడు నాగచైతన్య ప్రియురాలిగా.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే..
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు చైతూ. దీంతో ఇప్పుడు ఆయన నటించే తదుపరి సినిమాపై మరింత అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైతూ సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరలవుతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్యకు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. జోష్ సినిమాతో హీరోగా పరిచయమైన చైతూ.. ఆ తర్వాత విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇన్నేళ్ల సినీప్రయాణంలో చైతూ కెరీర్ మలుపు తిప్పిన సినిమా తండేల్. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చైతూ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో చైతూ సరసన సాయి పల్లవి నటించింది. ఈ సినిమా తర్వాత చైతూ తన నెక్ట్ ప్రాజెక్ట్ విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వచ్చిన విరూపాక్ష భారీ విజయాన్ని సాధించింది. దీంతో ఇప్పుడు కార్తిక్ దండు, చైతూ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై ఓ రేంజ్ హైప్ నెలకొంది.
ఇటీవలే ఈ మూవీ గురించి విడుదలైన చిన్న గ్లింప్స్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని టాక్. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. ఈ చిత్రంలో చైతూ సరసన ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నటిస్తుందట. ఇప్పుడు తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది ఆ హీరోయిన్. తెలుగులో మహేష్ బాబు మరదలు పాత్రలో కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు చైతూ సరసన ప్రియురాలిగా కనిపించనుందట. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మీనాక్షి చౌదరి.
గతంలో సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మీనాక్షి. ఇక హిట్ 2 సినిమాతో విజయం అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో ఆయన మరదలి పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు చైతూ సరసన నటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..




