AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? ఆ డబ్బుతో ఏం చేశారంటే..

దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ వేగంగా జరుగుతుండగా.. తాజాగా సోషల్ మీడియాలో తారక్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. తారక్ ఫస్ట్ మూవీ ఏంటో గుర్తుందా.. ?

Jr.NTR: ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? ఆ డబ్బుతో ఏం చేశారంటే..
Jr.NTR
Rajitha Chanti
|

Updated on: May 22, 2025 | 6:54 PM

Share

జూనియర్ ఎన్టీఆర్… పాన్ ఇండియా లెవల్లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరో. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని గ్లోబల్ స్టార్ గా మారారు. ఇక ఆ తర్వాత దేవర సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం వార్ 2 చిత్రంతోపాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వార్ 2 చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు తారక్. ఇదిలా ఉంటే.. తాజాగా తారక్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. చిన్న వయసులోనే హీరోగా మారారు. కెరీర్ తొలినాళ్లల్లోనే అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. 2001లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే నివేదికల ప్రకారం ఈ సినిమాకు ఎన్టీఆర్ కేవలం రూ.4 లక్షలు పారితోషికం తీసుకున్నారట. అయితే ఆ డబ్బు ఏం చేయాలో ఎన్టీఆర్ కు అర్థం కాలేదట. తన దగ్గర ఉంటే డబ్బును విలాసంగా ఖర్చు చేస్తానేమో అనే సందేహంతో తన మొదటి పారితోషికాన్ని నేరుగా తన తల్లి చేతిలో పెట్టారట. తారక్ నటించిన ఫస్ట్ మూవీ కమర్షియల్ హిట్ కాకపోయిన తన నటనకు మంచి మార్కులు కొట్టేశారు.

లవ్ స్టోరీస్ అయినా, మాస్ యాక్షన్ మూవీస్ అయినా తన పాత్రలో అద్భుతమైన నటనతో అదరగొట్టారు తారక్. ఇటీవలే దేవర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఈ సినిమాకు తారక్ రూ.60 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు టాక్. అలాగే ఇఫ్పుడు వార్ 2, డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాలకు అదే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి