- Telugu News Photo Gallery Cinema photos Director Sukumar Wife Thabitha Thrilled Over Her Childrens Talent, See photos
Sukumar: అప్పుడు కూతురు.. ఇప్పుడు కుమారుడు.. బిడ్డల ట్యాలెంట్ చూసి మురిసిపోతోన్న సుకుమార్ భార్య.. ఫొటోస్
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత తన బిడ్డలను చూసి తెగ మురిసిపోతోంది. ఇప్పటికే కూతురు సుకృతి సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఆ మధ్యన గాంధీ తాత చెట్టు సినిమాలో అద్బుతంగా నటించి ప్రశంసలతో పాటు పురస్కారాలు కూడా గెల్చుకుంది.
Updated on: May 21, 2025 | 8:01 PM

పుష్ప 2 సినిమాతో మరోసారి పాన్ ఇండియా ఫేమస్ అయిపోయాడు డైరెక్టర్ సుకుమార్. ఇక ఆయన భార్య బబిత కూడా నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటోంది.

ఇప్పుడు సుకుమార్ కూతురు, కుమారుడు కూడా తల్లిదండ్రుల బాటలోనే పయనిస్తున్నారు. చిన్న వయసులోనే తమ ట్యాలెంట్ ను చాటి చెబుతున్నారు.

సుకుమార్ కూతురు సుకృతి గాంధీ తాత చెట్టు సినిమాలో మెయిన్ లీడ్ పోషించింది. తన అద్బుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలతో పాటు, అవార్డులు కూడా అందుకుంది.

ఇప్పుడు సుకుమార్ కొడుకు సుక్రాంత్ సంగీతం నేర్చుకుంటున్నాడు. తాజాగా అతను స్కూల్ ప్రోగ్రాంలో గిటార్ వాయించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఈ సందర్భంగా తన పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన పలు ఫోటోలను సుకుమార్ భార్య తబిత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అలాగే తన పిల్లలను చూస్తుంటే గర్వంగా ఉందని మురిసిపోయింది. ప్రస్తుతం సుకుమార్ భార్య, పిల్లల ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.




