OTT Movie: ఆస్పత్రిలో మనుషుల్ని పీక్కు తినే దెయ్యాలు.. ఓటీటీలో దడ పుట్టిస్తోన్నహారర్ థ్రిల్లర్.. ఒంటరిగా చూడొద్దు
సాధారణంగా థియేటర్లలోనైనా, ఓటీటీల్లోనైనా గురువారం లేదా శుక్రవారం కొత్త సినిమాలు రిలీజవుతాయి. అయితే ఈ మధ్యన ఓటీటీలో మాత్రం ఉన్నట్లుండి కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అలా ఎప్పుడో రిలీజైన ఓ హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

సాధారణంగా హారర్, థ్రిల్లర్ సినిమాలన్నీ దయ్యాలు, పిశాచాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలాగే ఆత్మ మనిషి బాడీలోకి ప్రవేశించడం, మనుషులను ఇబ్బంది పెట్టడం, హింసించడం.. ఇలా రకరకాల కథలు, కథనాలతో ఈ మధ్యన సినిమాలు వస్తున్నాయి. అయితే ఈ మూవీ కొంచెం నెక్ట్స్ లెవెల్. హాలీవుడ్‌లో మ్యాన్ ఈటర్ మూవీస్ చూసే ఉంటారు. అంటే మనుషుల్ని పీక్కుతినే దెయ్యాల సినిమాలన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఈ మూవీ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. హారర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం ఆడియన్స్‌ను భయపెట్టేలా ఈ సినిమా సాగుతుంది. మనిషి చనిపోయిన తరువాత ఆత్మ దేవుడి దగ్గరకు వెళ్లాలి. కానీ, అలా వెళ్లకుండా అదే ఆత్మ ఈవిల్ స్పిరిట్‌గా మారిపోతుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఒక ఆస్పత్రిలోని వార్డు చుట్టూ తిరుగుతుంది. రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఆ వార్డులోకి ఎవరూ అడుగు పెట్టరు. ఎందుకంటే ఆ వార్డులో దెయ్యం ఉందని అక్కడి జనాల నమ్మకం. అయితే ఈ విషయం తెలిసి కూడా ఒక డాక్టర్ పేషెంట్‌ను తీసుకుని వెళుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ డాక్టర్, పేషెంట్ కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అని తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు భవానీ వార్డ్ 1997. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. అయితే పేరున్న నటీనటులు లేకపోవడం, పెద్దగా ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో ఆడియెన్స్ ఈ మూవీని పెద్దగా పట్టించుకోలేదు. గాయత్రీ గుప్తా, గణేశ్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించారు. థియేటర్లలో మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి భవానీ వార్డ్ 1977 సినిమా తప్పకుండా నచ్చుతుందని చెప్పొచ్చు.
🎬 Just watched Bhavani Ward 1997 — a musical horror that hits some notes but misses others. 🎶👻 While the premise is intriguing, the execution feels uneven. Full review: https://t.co/8e6u35SLAS#BhavaniWard1997 #TeluguCinema #HorrorThriller
— Alisha (@cinemareviewfun) May 20, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.