Tollywood: IITలో ఆలిండియా 238వ ర్యాంక్.. లక్షల్లో జీతం వదిలేసి సినిమాల్లోకి.. ఇప్పుడు క్రేజీ హీరో.. ఎవరో తెలుసా?
ఈ స్టార్ హీరో చదువులో టాపర్. ఐఐటీ-జేఈఈ ఆల్ ఇండియా 238వ ర్యాంక్ సాధించాడు. ఆ తర్వాత ఐఐటీ ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ డిస్టింక్షన్ లో పూర్తి చేశాడు. ఓ ఎమ్మెన్సీ కంపెనీలో లక్షల రూపాయాల జీతంతో ఉద్యోగంలో చేరాడు. కానీ..

చాలా మంది ఫ్యామిలీ కోసమో, ఇతర కారణాల వల్లనో నచ్చని ఉద్యోగాలు, పనులు చేస్తుంటారు. డబ్బులు వస్తున్నాయి కదా అని మనసు చంపుకుని మరీ జాబులు చేస్తుంటారు. కానీ ఈ హీరో అలా చేయలేదు. నైన్ టు ఫైవ్ జాబ్స్ అతనికి నచ్చలేదు. సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలన్న తపనతో లక్షల జీతాన్ని, కార్పొరేట్ లైఫ్ కు గుడ్ బై చెప్పేశాడు. మొదట్లో కొంచెం కష్టంగానే గడిచినా.. నెమ్మదిగా ఇండస్ట్రీలో కుదురుకున్నాడు. తన నటనతో అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ హీరోకు మంచి క్రేజ్ ఉంది. డిజిటల్ స్ట్రీమింగ్ ఇతని సినిమా, వెబ్ సిరీస్ వస్తుందంటే చాలు.. వ్యూయర్ షిప్ రికార్డులు బద్దలవుతుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ హీరో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. కేవలం సినిమాలు, వెబ్ సిరీసులతోనే కాదు లవ్, డేటింగ్, రిలేషన్ షిప్ విషయాలతోనూ ట్రెండ్ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో తనకంటే పెద్దదైన ఓ నటితో ప్రేమలో ఉన్నాడని బాలీవుడ్ కోడై కూస్తోంది. మన తెలుగు ఆడియెన్స్ కు ఇతని గురించి పెద్దగా పరిచయం లేకపోవచ్చు.. కానీ హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే వారికి ఈ హీరో బాగా పరిచయమే. అతనే అమోల్ పరాశర్.
1986, సెప్టెంబర్ 17న ఢిల్లీలో పుట్టిన అమోల్ చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండేవాడు. ఐఐటీ- జేఈఈ ఆల్ ఇండియా 238వ ర్యాంక్ సాధించాడు. ఆ తర్వాత ఐఐటీ ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. గ్రాడ్యుయేషన్ అనంతరం జెడ్ ఎస్ అసోసియేట్స్ అనే గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్‌లో మంచి జీతంతో ఉద్యోగంలో చేరాడు. కానీ నటనపై ఆసక్తితో కార్పొరేట్ జాబ్ కు వీడ్కోలు చెప్పేశాడు.
అమోల్ పేపర్ క్లిప్..
View this post on Instagram
2009లో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అమోల్. TVF ట్రిప్లింగ్” వెబ్‌సిరీస్ ఈ నటుడి కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. వీటితో పాటు డాలీ కిట్టీ ఔర్ వో చమక్తే సితారే, సర్దార్ ఉధమ్, క్యాష్, 36 ఫార్మ్‌హౌస్, స్వీట్ డ్రీమ్స్ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. అమోల్ ఇటీవల నటించిన కుల్: ది లెగసీ ఆఫ్ ది రైజింగ్స్, గ్రామ్ చికిత్సాలయ్ వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








