AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: సల్మాన్ ఖాన్ నివాసం దగ్గర కలకలం.. రెండు రోజుల్లో ఇద్దరు అరెస్ట్.. అసలేం జరుగుతోంది?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు వై-ప్లస్ సెక్యూరిటీని కల్పించారు. అంతేకాదు అతని అపార్ట్ మెంట్ కు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ కూడా అమర్చారు. అయినా రెండు రోజుల్లో ఇద్దరు ఆగంతకులు సెక్యూరిటీ కళ్లు గప్పి సల్మాన్ ఇంట్లోకి ప్రవేశించడం కలకలం రేపుతోంది.

Salman Khan: సల్మాన్ ఖాన్ నివాసం దగ్గర కలకలం.. రెండు రోజుల్లో ఇద్దరు అరెస్ట్.. అసలేం జరుగుతోంది?
Salman Khan
Basha Shek
|

Updated on: May 22, 2025 | 5:54 PM

Share

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ నివాసం గ్యాలక్సీ అపార్ట్‌మెంట్‌ లోకి చొరబడ్డ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇషా చాబ్రా అనే మహిళను అదుపు లోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ కళ్లు గప్పి ఇషా చాబ్రా లిఫ్ట్‌ వరకు వచ్చింది. అయితే ఉన్న వేరే సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. సల్మాన్‌ఖాన్‌ నివాసం లోకి ప్రవేశించేందుకు రెండు రోజుల్లో ఇద్దరు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. జితేంద్రసింగ్‌ అనే వ్యక్తి కూడా రెండు రోజుల క్రితం సల్మాన్‌ నివాసం లోకి చొరబడేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. తనకు సల్మాన్‌ఖాన్‌తో మాట్లాడాలని ఉందని , అందుకే అక్కడికి వచ్చినట్టు పోలీసు విచారణలో జితేంద్ర వెల్లడించాడు.

కొద్దినెలల క్రితం సల్మాన్‌ నివాసంపై లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యులు కాల్పులు జరిపారు. అప్పటి నుంచి సల్మాన్‌ఖాన్‌కు సెక్యూరిటీని పెంచారు. ఈ ఏడాది జనవరిలో, సల్మాన్ తన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ను పునరుద్ధరించి, దాని భద్రతను పెంచాడు. సల్మాన్ ఇంటి బయట గుర్తు తెలియని వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపారు. అతని బుల్లెట్లలో ఒకటి సల్మాన్ ఇంటి బాల్కనీ గోడను కూడా తాకింది. ఈ సంఘటన జరిగిన ఎనిమిది నెలల తర్వాత, సల్మాన్ తన బాల్కనీలో బుల్లెట్ ప్రూఫ్ గాజును ఏర్పాటు చేసుకున్నాడు. బుల్లెట్ ప్రూఫ్ బాల్కనీలతో పాటు, ఆధునిక భద్రతా వ్యవస్థలు, అధిక రిజల్యూషన్ CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు.నిరంతరం పోలీసు పహారా ఉన్నప్పటికి ఇద్దరు ఆయన నివాసం లోకి చొరబడడం భద్రతా వైఫల్యాన్ని బయటపెట్టింది.

ఇక సినిమాల విషయానికి వస్తే..  సల్మాన్ ఖాన్ సినిమా ‘సికందర్’ మార్చి 30న విడుదలైంది. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ దారుణ పరాజయం పాలైంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. అలాగే సౌతిండియన్ డైరెక్టర్ మురుగ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రంజాన్ కానుకగా విడుదలైన ఈ మూవీ సల్లూ అభిమానులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇక సల్లూ తన తర్వాతి ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..