- Telugu News Photo Gallery Cinema photos These horror movies are the best in Hindi and will send shivers down your spine
Bollywood Horror: ఈ హారర్ మూవీస్ హిందీలో ది బెస్ట్.. వెన్నులో వణుకు పుట్టాల్సిందే..
హారర్ మూవీస్ ఎంతగానో బయపెట్టినప్పటికీ ఇండస్ట్రీ వీటికి మంచి డిమాండ్ ఉంది. ఈ కాన్సెప్ట్ సినిమా అంటే ఆల్మోస్ట్ హిట్ అని ఫిక్స్ అయిపోవాల్సిందే. హారర్ అంటూ భారీ వసూళ్లు అందుకున్న సినిమాలు చాల ఉన్నాయి. నిరాశపరిచిన చిత్రాలు తగ్గువగానే ఉన్నాయి. అయితే టాప్ 5 హిందీ హారర్ ఏంటి.? ఎప్పుడు వచ్చాయి.? ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయి.? ఈరోజు చూద్దాం..
Updated on: May 22, 2025 | 5:18 PM

తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న హర్రర్-థ్రిల్లర్ సిరీస్ 'ఖౌఫ్'. ఈ కథనం గ్వాలియర్‌కు చెందిన మధు అనే యువతి ఢిల్లీలోని మహిళా హాస్టల్‌కు వెళ్లి, అతీంద్రియ శక్తులు, ఆమె గతంలోని వెంటాడే గాయాలను ఎదుర్కోవడాన్ని అనుసరిస్తుంది. ఈ కథాంశం ద్వారా, లింగ ఆధారిత అణచివేత వంటి కొన్ని సామాజిక నిబంధనలు ఆధారంగా రూపొందింది.

బల్బుల్ అనేది 2020 వచ్చిన హిందీ పీరియడ్ హారర్ చిత్రం. దీన్నిఅన్వితా దత్ తెరకెక్కించారు. ఇందులో త్రిప్తి డిమ్రీ పాటు అవినాష్ తివారీ, పావోలీ డ్యామ్, రాహుల్ బోస్, పరంబ్రత ప్రధాన పాత్రల్లో నటించారు. 19వ శతాబ్దంలో బెంగాల్ ప్రెసిడెన్సీలోని ఒక గ్రామంలో సాగె కథాంశంతో రూపొందింది.

ఈ ఏడాది 11 ఏప్రిల్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న చిత్రం చోరీ 2. ఈ బాలీవుడ్ హారర్ మూవీని, విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు. 2021లో వచ్చిన చోరీకి సీక్వెల్ ఈ చిత్రం. ఇందులో నుష్రత్ భరుచ్చా ప్రధాన పాత్రలో నటించారు.

పరి అనేది 2018లో విడుదలైన హిందీ సూపర్ నేచురల్ హర్రర్ చిత్రం. ఈ సినిమాతో ప్రోసిత్ రాయ్ దర్శకుడుగా పరిచయం అయ్యారు. ఇందులో అనుష్క శర్మ ప్రధానపాత్రలో నటించింది. ఆమె క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ కంపెనీలో నిర్మించిన మూడవ సినిమా. పరంబ్రత ఛటర్జీ, రితాభరి చక్రవర్తి, రజత్ కపూర్, మాన్సి ముల్తాని సహాయక పాత్రల్లో నటించారు.

రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ కామెడీ హర్రర్ చిత్రం స్త్రీ. 2018లో విడుదలైన ఇది అమర్ కౌశిక్ దర్శకత్వంలో తొలి సినిమా. ఇందులో పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ కీలక రోల్స్ చేసారు. ఈ కథాంశం ఓ కన్నడ పట్టణ పురాణం నాలే బా ఆధారంగా రూపొందించబడింది.




