Prabhas: స్టైల్ మార్చిన ప్రభాస్.. కాన్సన్‌ట్రేషన్ కేవలం ఒక్కదానిపైనే
డార్లింగ్ ప్రభాస్ రూటు మార్చారు. ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తూ వార్తల్లో హల్‌చల్ చేస్తూ ఉండే డార్లింగ్... నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం ఆ పద్దతిని పక్కన పెట్టేయాలనుకుంటున్నారు. ప్రభాస్ లైనప్‌లో కేవలం ఒకే సినిమా చేస్తా అని కూర్చుంటే అయ్యే పనేనా... ఈ విషయంలో డార్లింగ్ ప్లానింగ్ ఏంటి..? ఈ స్టోరీలో చూద్దాం.
Updated on: May 22, 2025 | 5:14 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ లైనప్‌లో ఎప్పుడూ ఐదారు సినిమాలు కనిపిస్తుంటాయి. కనీసం రెండు సినిమాలైనా సెట్స్ మీద ఉంటాయి.

కానీ అప్ కమింగ్ మూవీ విషయంలో ఈ స్టైల్ పక్కన పెట్టేయాలని ఫిక్స్ అవుతున్నారు ప్రభాస్. పూర్తిగా ఒక్క సినిమా మీదే కాన్సన్‌ట్రేట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ప్రజెంట్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు ప్రభాస్. సెప్టెంబర్ నుంచి స్పిరిట్‌ను పట్టాలెక్కించాల్సి ఉంది.

కానీ డార్లింగ్ లేటెస్ట్ డెసిషన్‌తో స్పిరిట్ షూటింగ్ మరో నాలుగు నెలలు ఆలస్యం కానుందన్న టాక్ వినిపిస్తోంది.సెట్స్ మీద ఉన్న రెండు సినిమాలు పూర్తయిన తరువాతే స్పిరిట్‌ను పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు ప్రభాస్.

స్పిరిట్‌లో ప్రభాస్‌ను డిఫరెంట్ చూపించాలనుకుంటున్న సందీప్ బల్క్ డేట్స్ కావాలంటున్నారు. అందుకే ప్రియర్ కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకొని ఫుల్ టైమ్ స్పిరిట్‌కే కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్. మరి ఈ ప్లానింగ్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.




