AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో మాత్రం టాప్ ట్రెండింగ్.. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోన్న లేటెస్ట్ సినిమా

ఈ మధ్యన థియేటర్లలో రిలీజై ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు ఓటీటీలో మాత్రం అదరగొడుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై ఆడియెన్స్ ఆదరణకు నోచుకోని చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం రికార్డు వ్యూయర్ షిప్ తెచ్చుకుంటున్నాయి. ఈ మూవీ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

OTT Movie: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో మాత్రం టాప్ ట్రెండింగ్.. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోన్న లేటెస్ట్ సినిమా
OTT Movie
Basha Shek
|

Updated on: May 23, 2025 | 7:17 AM

Share

ఇండియాలో టాప్ ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన ZEE5 ఈ వేసవికి ప్రేక్షకులను మెప్పించే యాక్షన్, థ్రిల్లర్, కామెడీ సినిమాలు, సిరీస్‌లతో మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ZEE5లో స్ట్రీమింగ్ అవుతోన్న సూపర్ హిట్ మూవీ ‘రాబిన్ హుడ్’ అందరినీ ఆకట్టుకుంటూ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించింది. నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ చిత్రం ఓ వైపు టెలివిజన్‌లోనూ, ZEE5లోనూ మే10న ప్రీమియర్ అయిన సంగతి తెలిసిందే. ట్రెండింగ్‌లో నిలిచి టాప్ చార్ట్‌లో నిలిచిన ఈ చిత్రం యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.

‘రాబిన్‌హుడ్‌’ క‌థ విష‌యానికి వ‌స్తే.. రామ్ (నితిన్‌) ఓ అనాథ‌, తెలివైన యువ‌కుడు. కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా త‌నొక రాబిన్‌హుడ్‌గా మారి ధ‌న‌వంతుల నుంచి డ‌బ్బ‌ను దొంగిలించి అవ‌స‌ర‌మైన వారికి సాయం చేస్తుంటాడు. అనుకోకుండా అంత‌ర్జాతీయ డ్ర‌గ్స్ సామ్రాజ్యానికి రాజ‌మైన వ్య‌క్తితో త‌ల‌ప‌డాల్సి వ‌స్తుంది. తర్వాత ఏమౌతుంది.. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేదే కథాంశం.

ఇవి కూడా చదవండి

వెంకీ కుడుముల దర్వకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇంకా రాజేంద్ర ప్రసాద్, షైన్ టామ్ చాకో, దేవ్ దత్త నాగె, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. మాజీ ఆస్ట్రేలియన్ క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో స్పెషల్ క్యామియో పాత్రలో నటించటం ద్వారా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ‘రాబిన్‌హుడ్’ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

జీ5లో రాబిన్ హుడ్ స్ట్రీమింగ్..

ZEE5లో ప్రత్యేకంగా అత్యంత వినోదాత్మక యాక్షన్-కామెడీ రాబిన్‌హుడ్‌ని చూసి ఎంజాయ్ చేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..