OTT Movie: పోలీసులకు హింట్ ఇచ్చి మరీ హత్యలు చేసే సైకో .. ఓటీటీలో అద్దిరిపోయే క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
క్రైమ్ సినిమాలకు సంబంధించి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ రకమైన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ సినిమా కూడా సరిగ్గా ఇదే జానర్ కు చెందినదే.

సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలంటే మూవీ లవర్స్ ఎగబడి చూస్తారు. అందుకే ఇటీవల ఓటీటీల్లో ఈ జానర్ సినిమాలకు మరింత క్రేజ్ ఏర్పడింది. ఒకవేళ మీరు కూడా ఈ వీకెండ్ లో ఇలాంటి సినిమాల కోసమే ఓటీటీలో వెతుకుతున్నారా? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఈ సినిమా ఆద్యంతం ఎంతో గ్రిప్పింగ్ స్క్రీన ప్లేతో ఎంగేజింగ్ గా సాగుతుంది. ట్విస్టులు కూడా చాలానే ఉంటాయి. ఇందులో సైకో కిల్లర్ పోలీసులకు ముందుగానే హింట్ ఇచ్చి హత్యలు చేస్తుంటాడు. అయినా ఆ సైకో కిల్లర్ జాడ కనిపెట్టలేకపోతారు పోలీసులు. ఈ సినిమా మొత్తం చెన్నై నగరం చుట్టూ తిరుగుతుంది. మొదట ఒక మహిళ తన అపార్ట్‌మెంట్ నుంచి దూకి చనిపోతుంది. మొదట అందరూ ఇది సూసైడ్ అని భావిస్తారు. కానీ కొన్ని రోజుల్లో ఇలాంటి సంఘటనలు మరిన్ని జరుగుతాయి. మహిళలు ఒకే విధంగా బిల్డింగ్‌ల నుంచి కిందుకు దూకి చనిపోతారు. దీంతో ఈ మిస్టరీని ఛేదించేందుకు హీరో ఇన్‌స్పెక్టర్ కాళిదాస్ (భరత్) రంగంలోకి దిగుతాడు. ఇవి ఆత్మహత్యలు కాదని, సీరియల్ కిల్లింగ్‌లని కాళిదాస్ అనుమానిస్తాడు. దీంతో ఈ కేసును మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ క్రమంలోఅతనికి కొన్ని సంచలన విషయాలు తెలుస్తాయి. మరణించిన మహిళల మధ్య కొన్ని వింత కనెక్షన్లు ఉన్నాయని కనిపెడతాడు. వారంతా ఒకే బ్యూటీ పార్లర్ కు వెళ్లారని గ్రహిస్తాడు.
కాగా కాళిదాస్ భార్య హీరోయిన్ విద్యా (అన్ షీటల్) కూడా ఇదే బ్యూటీ పార్లర్ కు వెళ్లారన్న విషయం తెలుసుకుంటాడు. అంటే ఆ సైక కిల్లర్ తన భార్యను కూడా టార్గెట్ చేశాడని అర్థం చేసుకుంటాడు. కానీ అక్కడే ఊహించిని ట్విస్ట్ జరుగుతుంది? మరి ఆ సైకో కిల్లర్ పోలీసులకు ఇచ్చిన షాక్ ఏమిటి? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు ఆడవాళ్లను టార్గెట్ చేశాడు? పోలీసులు అతనిని పట్టుకున్నారా? లేదా? అంటే ఈ మూవీ చూడాల్సిందే.
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు కాళీ దాస్. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. యూట్యూబ్ లో కూడా ఫ్రీగా చూడవచ్చు.
యూట్యూబ్ లోనూ ఫ్రీగా చూడొచ్చు..
Click Here for Full Movie 👉 https://t.co/g1Wu2iCWi7
Watch Crime Thriller Inspector Bharath Telugu Movie on YouTube/SriBalajiMovies#InspectorBharath #Bharath #AnnSheetal #SureshMenon #AadhavKannadasan #LatestDubbedMovies #SriBalajiVideo pic.twitter.com/9LFIgdewS3
— Sri Balaji Video (@sribalajivideos) April 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.