HIT 3 OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి నాని వందకోట్ల సినిమా.. హిట్ 3 స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా హిట్ 3. శైలెష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. మే01న థియేటర్లలో విడుదలైన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3: ది థర్డ్ కేస్. గతంలో వచ్చిన హిట్ సిరీసుల్లో ఇది మూడో సినిమా. మొదటి రెండు పార్ట్ లను తెరకెక్కించిన శైలేష్ కొలను హిట్-3ని సినిమాను తెరకెక్కించాడు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య మే 01న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన హిట్-3 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. సినిమాలో రక్త పాతం, హింస ఎక్కువైందని విమర్శలు వచ్చినా నాని ఉండడంతో హిట్-3 మూవీ ఆడియెన్స్ కు బాగా ఎక్కేసింది. ఈ మూవీ వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అలాగే ఓవర్సీస్ లోనూ నాని సినిమాకు మంచి స్పందన వచ్చింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీని ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడనుంది. హిట్ 3 సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో హిట్ 3 సినిమాను మే 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ తన అప్ కమింగ్ మూవీస్ లిస్ట్‌లో హిట్ 3 మూవీని పెట్టేసింది. అయితే నెట్ ఫ్లిక్స్, హిట్ 3 టీం దీనిపై అధికారికంగా ప్రకటన రిలీజ్ చేయాల్సి ఉంది.
నాని హిట్3 సినిమా కోసం నెట్ ఫ్లిక్స్ రూ. 50 కోట్లకు పైగానే చిత్ర బృందానికి చెల్లించినట్లు తెలుస్తోంది. వాల్‌పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని, నానిలు హిట్ 3 చిత్రాన్ని నిర్మించారు. నాని, శ్రీనిధి శెట్టిలతో పాటు సూర్య శ్రీనివాస్, రావు రమేష్, సముద్ర ఖని, కోమలి ప్రసాద్, నెపోలియన్, రవీంద్ర విజయ్, ప్రతీక్ బబ్బర్, టిస్కా చోప్రా తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే అడవిశేష్, కార్తీ క్యామియో రోల్స్ లో కనిపించారు. ఈ సినిమాకు మిక్కీ జే. మేయర్ స్వరాలు సమకూర్చాడు. మరి థియేటర్లలో హిట్ 3 సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ నాని సినిమాను చూడాలనుకుంటున్నారా? అయితే మరో 4 రోజులు వెయిట్ చేయండి.
మే 29 నుంచి..
#HITTheThirdCase will be streaming on @NetflixIndia from this Thursday in Dolby Vision.#Hit3 #HIT3TheThirdCase @NameisNani @SrinidhiShetty7 @KolanuSailesh @WallPosterCinma pic.twitter.com/7T6tOgmsAw
— Cinephly (@saichndra) May 24, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








