AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiru 157: సైలెంటుగా స్టార్ట్ చేశారు.. హైదరాబాద్‌లో మెగా 157 షూటింగ్ ప్రారంభం

భోళా శంకర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇంతలోనే మరో కొత్త సినిమాను మొదలెట్టేశారు మెగాస్టార్. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Chiru 157: సైలెంటుగా స్టార్ట్ చేశారు.. హైదరాబాద్‌లో మెగా 157 షూటింగ్ ప్రారంభం
Chiru 157
Basha Shek
|

Updated on: May 23, 2025 | 6:23 PM

Share

ఎంటర్‌టైన్‌మెంట్, చరిష్మాతో ప్రేక్షకులను అలరించేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న #మెగా157 బ్లాక్‌బస్టర్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోంది. వరుస విజయాలు అందించిన అనిల్ రావిపూడికి ఇది చిరంజీవితో తొలి చిత్రం కావడం విశేషం. చిరంజీవి అభిమానులు ఎప్పటి నుంచో ఆయనను మళ్లీ పూర్తి స్థాయి హ్యూమరస్ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు. సన్ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుశ్మిత కొనిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రెస్టీజియస్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అర్చన ప్రజెంట్ చేస్తున్నారు. నయనతార చిరంజీవికి జోడిగా నటిస్తున్నారు.

తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న అనిల్ రావిపూడి నిరీక్షణకు తెరపడింది. ఈ రోజు హైదరాబాద్‌లో సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభమైంది. మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అనిల్ రావిపూడి లానే చిరంజీవి కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. తాజాగా సంక్రాంతికి విడుదలైన “సంక్రాంతికి వస్తున్నాం” ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తో మంచి జోరు మీదున్న అనిల్ రావిపూడి, తన యూనిక్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. టెక్నికల్ క్రూ పరిచయ వీడియో, తర్వాత నయనతార ప్రోమో వీడియో ఆడియన్స్ ని కట్టిపడేసింది.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. రైటర్స్ ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు, ఎస్ కృష్ణ కూడా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.

  • నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార
  • సాంకేతిక సిబ్బంది:
  • రచన, దర్శకత్వం – అనిల్ రావిపూడి
  • నిర్మాతలు – సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
  • బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
  • సమర్పణ – శ్రీమతి అర్చన
  • సంగీతం – భీమ్స్ సిసిరోలియో
  • డీవోపీ – సమీర్ రెడ్డి
  • ప్రొడక్షన్ డిజైనర్ – ఎ ఎస్ ప్రకాష్
  • ఎడిటర్ – తమ్మిరాజు
  • రైటర్స్ – ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కృష్ణ
  • Vfx సూపర్‌వైజర్ – నరేంద్ర లోగిసా
  • లైన్ ప్రొడ్యూసర్ – నవీన్ గారపాటి
  • అడిషనల్ డైలాగ్స్ – అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
  • చీఫ్ కో డైరెక్టర్ – సత్యం బెల్లంకొండ
  • పీఆర్వో – వంశీ-శేఖర్
  • మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..