OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్న సినిమా.. క్షణ క్షణం ఉత్కంఠ.. తక్కువ బడ్జెట్లోనే సంచలనం..
ప్రస్తుతం ఓటీటీల్లో చాలా తక్కువ ఖర్చుతో నిర్మించిన చిత్రాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. తాజాగా ఓ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సంచలనం సృష్టిస్తోంది. ఈ మూవీలో మొదటి నిమిషం నుంచే బలమైన ఉత్కంఠ స్టార్ట్ అవుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాపీష్ షేక్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది.

ఈమధ్య కాలంలో తక్కువ బడ్జెట్ తో రూపొందించిన సినిమాలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఈ మూవీ కథ ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. ఈ చిత్రానికి IMDbలో కూడా బలమైన రేటింగ్ ఉంది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. అదే ఆఫీసర్ ఆన్ డ్యూటీ. మలయాళంలో రూపొందించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 2020 ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో కుంచాకో బోబన్ ప్రధాన పాత్ర పోషించారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎప్పటిలాగే అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. ఆయనతోపాటు విశాఖ్ నాయర్, జగదీష్, ప్రియమణి కీలకపాత్రలు పోషించారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కుంచాకో బోబన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ హరిశంకర్ చుట్టూ తిరుగుతుంది. హరి అనే పోలీసు అధికారిని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పదవి నుండి తొలగిస్తారు. అతను కేరళలోని అలువా పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఎంపికవుతాడు. కానీ కర్ణాటక పోలీస్ ఇన్ స్పెక్టర్ జోసెఫ్ ఇంట్లో మరణించడంతో అసలు కథ ప్రారంభమవుతుంది. ఆత్మహత్య అని అందరూ భావిస్తారు. కానీ 8 నెలల తర్వాత హరిశంకర్ నకిలీ బంగారు అభరణాలకు సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తుండాు. అదే సమయంలో మాదకద్రవ్యాలు, అమ్మాయిల అక్రమ రవాణా గురించి పెద్ద నెట్ వర్క్ కనుగొంటాడు.
ఈ కేసు దర్యాప్తు హరిశంకర్ జీవితాన్ని, కెరీర్‌ను ప్రమాదంలో పడే ప్రమాదకరమైన మలుపులకు తీసుకెళుతుంది అనేది సినిమా. చివరకు హరి శంకర్ ఈ కేసును ఎలా పరిష్కరిస్తాడు అనేది ఇందులో చూడొచ్చు. సినిమా ప్రారంభమైన మొదటి క్షణం నుంచి క్లైమాక్స్ వరకు ప్రతిక్షణం ఉత్కంఠ, ఊహించని ట్విస్టులతో ఈ మూవీ సాగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా దేశంలోని టాప్ 10 జాబితాలో రెండవ స్థానంలో ఉంది.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..




