OTT Movie: పెళ్లి కోసం మర్డర్ ప్లాన్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమా.. పొట్ట చెక్కలవ్వాల్సిందే
ఎప్పటిలాగే ఈ శుక్రవారం (మే22) ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. అందులో ఈ లేటెస్ట్ మూవీ కూడా ఒకటి. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఎప్పటిలాగే ఈ శుక్రవారం అటు థియేటర్లలోనూ, ఇటు ఓటీటీలోనూ పలు కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో అయితే సుమారు 20కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అందులో లేటెస్ట్ తెలుగు సినిమా కూడా ఉంది. ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైన మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. అలాగే సినిమాలో కాసిన్ని సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బాక్సాఫీస వద్ద ఈ మూవీకి ఓ మోస్తరు గానే వసూళ్లు వచ్చాయి. జాతకాలను అతడి నమ్మడం వల్ల ఎలాంటి అనార్థాలు తలెత్తుతాయన్నది నవ్విస్తూనే థ్రిల్లింగ్‌గా డైరెక్టర్ ఈ మూవీలో చూపించాడు. అయితే థియేటర్‌లో విడుదలైన నెలరోజుల్లోపే ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. శుక్రవారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచే ఈ సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ కు రానుందన్న మాట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుందని నెట్టింట టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా పేరు సారంగపాణి జాతకం. ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ హీరో, హీరోయిన్లుగా నటించారు.వీకే నరేష్, తణికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమా కథ విషయానికి వస్తే.. సారంగపాణి(ప్రియదర్శి) కి జాతకాల పిచ్చి ఎక్కువ. ఈ క్రమంలో కార్ షోరూమ్‌లో తనతో పాటు పనిచేసే మైథలిని (రూప కొడవాయూర్) ప్రేమిస్తాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని సారంగపాణి, మైథిలి అనుకుంటారు. అనుకున్నట్లే నిశ్చితార్థం చేసుకుంటారు. అయితే సారంగపాణి ఓ హత్య చేస్తాడని జ్యోతిష్‌యుడు జిగేశ్వరానంద్ (శ్రీనివాస్ అవసరాల) చెబుతారు. దీంతో సారంగపాణి… హంతకుడి భార్య అనే ముద్ర మైథిలిపై పడకూడదని పెళ్లికి ముందే ఓ హత్య చేయాలని ప్లాన్స్ చేస్తాడు. ఈ మర్డర్ ప్లాన్‌లో సారంగపాణికి అతడి స్నేహితుడు చందు (వెన్నెలకిషోర్) ,వైవా హర్ష ఎలా సాయం చేశారు? చివరకు ఏమైంది అన్నది తెలుసుకోవాలంటే ఈ సారంగపాణి జాతకం సినిమా చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








