Prabhas: ప్రభాస్ లుక్ జోకర్లా ఉంది.. నాకు కల్కి సినిమా నచ్చలేదు.. బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్..
జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఏకంగా ర.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింంది. ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన మేకింగ్ చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా రానుంది. త్వరలోనే కల్కి 2 గురించి అధికారికంగా ప్రకటించనున్నారు.

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన సినిమా కల్కి 2898 ఏడి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించారు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఏకంగా ర.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింంది. ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన మేకింగ్ చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా రానుంది. త్వరలోనే కల్కి 2 గురించి అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే కల్కి 2898 ఏడి చిత్రం ఆగస్ట్ 22న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇదిలా ఉంటే.. ప్రపంచం మొత్తం మెచ్చిన కల్కి 2898 ఏడి సినిమాపై బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ బాగోలేదని.. కల్కి సినిమా తనకు అస్సలు నచ్చలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. “నేను కల్కి సినిమా చూశాను. నాకు అస్సలు నచ్చలేదు. అందులో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడు. తనను అలా చూసి బాదేసింది. ఈ సినిమాను మ్యాడ్ మ్యాక్స్ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేశాను. కానీ ఆ రేంజ్ లో సినిమాము తెరకెక్కించడంలో దర్శకనటులు ఫెయిలయ్యారు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అర్షద్ వర్సి కామెంట్స్ నెట్టింట వైరలవుతుండగా.. అతడి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కోట్లాది మంది ఆదరించిన సినిమాపై ఇలా విషం చిమ్ముతున్నాడేంటీ ? రూ. 1200 కోట్లు రాబట్టిన సినిమా గురించి ఇలా కామెంట్స్ చేయడం అసలు బాగోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఎప్పుడూ ప్రభాస్ మీద పడి ఏడుస్తూనే ఉంటారని.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయితే దర్శకనటులు ఫెయిలయ్యారని అనడం కరెక్ట్ కాదంటూ సీరియస్ అవుతున్నారు.








