Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఫన్నీ టాస్క్.. ప్రియాంక చేసిన పనికి హర్ట్ అయిన అమర్ దీప్
ఒక్క అమర్ దీప్ తప్ప మిగిలిన వారందరు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్ లో ఫైనల్ కంటెస్టెంట్ అవ్వడానికి టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఎవరైతే ఈ టాస్క్ ల్లో విజేతగా నిలుస్తారో వారు డైరెక్ట్ గ ఫైనలిస్ట్ అవుతారని చెప్పాడు. ఈ క్రమంలో రకరకాల గేమ్స్ అడిస్తున్నాడు. ప్రస్తుతం పాయింట్స్ విషయంలో అమర్ దీప్ నెంబర్ వన్ పొజిషన్ కు వెళ్ళాడు.

బిగ్ బాస్ సీజన్ 7 మరికొద్ది వారాల్లో ముగిసిపోనుంది. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో ఏకంగా ఏడుగురు ఉన్నారు. ఒక్క అమర్ దీప్ తప్ప మిగిలిన వారందరు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్ లో ఫైనల్ కంటెస్టెంట్ అవ్వడానికి టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఎవరైతే ఈ టాస్క్ ల్లో విజేతగా నిలుస్తారో వారు డైరెక్ట్ గ ఫైనలిస్ట్ అవుతారని చెప్పాడు. ఈ క్రమంలో రకరకాల గేమ్స్ అడిస్తున్నాడు. ప్రస్తుతం పాయింట్స్ విషయంలో అమర్ దీప్ నెంబర్ వన్ పొజిషన్ కు వెళ్ళాడు. ఫైనలిస్ట్ టాస్క్ ల నుంచి తప్పుకున్న శోభా, శివాజీ తమ పాయింట్స్ ఇవ్వడంతో అమర్ మొదటి స్థానంలోకి వెళ్ళాడు.ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో గెస్ చెయ్ గురూ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
సౌండ్స్ ను బట్టి ఆ వస్తువు లేదా జంతువు ఎదో గుర్తుపట్టి బోర్డు పై రాయాలని చెప్పాడు. ఈ టాస్క్ చాలా ఫన్నీగా సాగిందని అర్ధమవుతుంది. అయితే అమర్ కు షీప్ కు గోట్ కు తేడా తెలియలేదు. రెండు మేకలే అని అనుకున్నాడు. యావర్, ప్రశాంత్ సరిగ్గా గెస్ చేయలేకపోవడంతో ఆ ఇద్దరినీ నెక్స్ట్ రౌండ్స్ నుంచి తప్పించాడు బిగ్ బాస్ . ఆతర్వాత అమర్ ను కప్పు ఎలా అరుస్తుంది అని అడిగాడు. దానికి మనోడు బెక బెక అంటూ సమాధానం చెప్పాడు.. మరోసారి సౌండ్ చేసి అది మెగా కప్పు, ఇది అడా కప్పు అంటూ నవ్వులు పూయించాడు.
హెలికాఫ్టర్ సౌండ్ ఎలా ఉంటుంది ని ప్రశాంత్ ను అడిగాడు బిగ్ బాస్. దానికి మనోడు ఎదో సౌండ్ చేసి చూపించాడు. స్ట్రీమ్ ఇంజన్ కాదు ప్రశాంత్ అంటూ పంచ్ వేశాడు బిగ్ బాస్. ఆతర్వాత ప్రియాంకా దగ్గరున్న పాయింట్స్ నుంచి సగం పాయింట్స్ మీరనుకునే ఒకరికి ఇవ్వచ్చు అని చెప్పాడు. దాంతో ప్రియాంక గౌతమ్ పేరు చెప్పింది. దాంతో అమర్ హర్ట్ అయ్యాడు . నాకు ఇవ్వాలనిపించలేదా ..? అని ప్రశ్నించాడు. ప్రతిదీ ఇంపోర్ట్టెంట్ అని ప్రియాంకా అంటే ఎదవను అయ్యింది నేనేగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అమర్ దీప్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




