AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురువారం సినిమా సెలబ్రిటీస్ ఏయే పోలింగ్ బూతుల్లో ఓటెయ్యనున్నారంటే..?

విధిగా ఓటేద్దాం అంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు.. సినిమా సెలబ్రిటీలు. పోలింగ్‌డేని హలీడేగా భావించకుండా.. మంచి భవిష్యత్తు కోసం ఓటేయాలని చెబుతున్నారు. ఈ మేరకు పలువరు అభిమానులకు వీడియో సందేశాలు పంపుతున్నారు. కాగా టాలీవుడ్ సెలబ్రిటీలు గురువారం ఏయే పోలింగ్ బూతుల్లో ఓటెయ్యనున్నారో ఇప్పుడు చూద్దాం...

గురువారం సినిమా సెలబ్రిటీస్ ఏయే పోలింగ్ బూతుల్లో ఓటెయ్యనున్నారంటే..?
Tollywood Celebrities
Ram Naramaneni
|

Updated on: Nov 29, 2023 | 4:44 PM

Share

మరి కొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌. సర్వం సిద్ధం అంటోంది ఎన్నికల కమిషన్‌. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలో ఏర్పాట్లను పరిశీలించారు CEO వికాస్‌ రాజ్‌. గురువారం పోలింగ్‌ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బందితో పాటు ఈవీఎంలను తరలిస్తోంది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 వేల 290 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 3 కోట్ల 26 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. పోలింగ్‌ కోసం 35 వేల 655 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల 94 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌తో పాటు పరిశీలన కోసం 22 వేలమంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్లను నియమించారు. దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కొనసాగుతుంది. ఎన్నికల బందోబస్తు విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు, 50 వేల మంది పోలీసులు పాల్గొంటున్నారు.

గురువారం ఓటుహక్కు వినియోగించుకోనున్న సినిమా సెలబ్రటీస్

  • జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ — పోలింగ్‌ బూత్‌ 165: మహేశ్‌బాబు, నమ్రత ,మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్  ‌
  • పోలింగ్‌ బూత్‌ 164: విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ , శ్రీకాంత్‌
  • ఎఫ్‌ఎన్‌సీసీ –పోలింగ్‌ బూత్‌ 164: రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌
  • పోలింగ్‌ బూత్‌ 160: విశ్వక్‌సేన్‌
  • పోలింగ్‌ బూత్‌ 166: దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు,
  • జూబ్లీహిల్స్‌ క్లబ్‌– పోలింగ్‌ బూత్‌ 149: చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన, నితిన్‌
  • ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ — పోలింగ్‌ బూత్‌ 157: రవితేజ
  • ఓబుల్‌రెడ్డి స్కూల్‌ — పోలింగ్‌ బూత్‌ 150: జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి
  • బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌– పోలింగ్‌ బూత్‌ 153: అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌
  • వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌– పోలింగ్‌ బూత్‌ 151: నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌
  • మణికొండ హైస్కూల్ : ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం
  • షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ : రాజమౌళి రామారాజమౌళి
  • రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ –ఆర్థిక సహకార సంస్థ: అల్లరి నరేశ్‌
  • యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..