Bigg Boss Telugu 10: ఈ వారం బిగ్‌బాస్ నామినేషన్స్‌లో ఏకంగా 9 మంది కంటెస్టెంట్స్.. డేంజర్ జోన్‌లో ఉన్నది ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ట్విస్ట్ ల మీద ట్విస్టులతో సాగుతోంది. ముఖ్యంగా కంటెస్టెంట్ల ఎలిమినేషన్స్ కు సంబంధించి బిగ్ బాస్ ఇచ్చే ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తున్నాయి. మరి నాలుగో వారం ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్నారో తెలుసా?

ఆడియన్స్ అంచనాలకు అందకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా ఎలిమినేషన్ల విషయంలో బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్టులకు ఆడియెన్స్ తలలు పట్టుకుంటున్నారు. బిగ్ బాస్మొదటివారం చైత్ర రెండవ వారం కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు . మూడవ వారం వంశీ లేదా వర్షిణి ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. ముఖేష్ వీళ్లిద్దరి కోసం తన కెప్టెన్సీ పదవిని కూడా త్యాగం చేసి, మూడవ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించారు. మొత్తానికి సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో వారంలోకి కూడా అడుడు పెట్టింది. ఎప్పటిలాగే సోమవారం కాబట్టి ఎలిమినేషన్స్ కు సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ హోరా హోరీగా సాగింది. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ముఖ్యంగా ఈ వారం నామినేషన్ లో ఎక్కువగా మిథిలేష్ ఎలిమినేషన్ కి సహకరించిన అంశంపైనే చర్చ జరిగింది. అంతేకాకుండా ముఖేష్, త్రిగుణ్, సృష్టి లని టార్గెట్గా చేసుకొని చాలామంది నామినేట్ చేశారు. ఇందులో భాగంగా ఒకరిపై ఒకరు ఫోమ్ వేసుకుంటూ తమ పాయింట్ చెప్పి కంటెస్టెంట్స్ ను చెప్పి నామినేషన్స్ వేశారు.
గత వారం కెప్టెన్సీ పదవిని వదులుకొని ఇద్దరినీ సేవ్ చేసి డైరెక్ట్ గా నామినేషన్ లోకి వచ్చేశాడు ముఖేష్. ఆయనతో పాటు మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ నాలుగో వారం నామినేషన్స్ లోకి వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా బిగ్ బాసే ప్రకటించాడు. ఈవారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అర్హత ఉన్న వారిలో ముఖేష్, త్రిగుణ్, దేబ్ జానీ , రోహిణి షాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టి ఉన్నట్టు బిగ్ బాస్ ప్రకటించారు. ఈ లిస్టును ఒక్కసారి గమనిస్తే.. నామినేషన్స్ లో ఉన్న 9 మంది టాప్ కంటెస్టెంట్స్. హౌస్ లో అంతో ఇంతో కంటెంట్ ఇస్తున్న వాళ్లే. మరి వీరిలో ఎవరు హౌస్ నుంచి ఎలిమినేటట్ కానున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇందుకోసం ఇప్పటికే ఆన్ లైన్ ఓటింగ్ పోల్ కూడా ఓపెన్ అయింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లేటెస్ట్ ప్రోమో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




