AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RJ Kajal: నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. బిగ్ బాస్ కాజల్ ఎమోషనల్ పోస్ట్..

బుల్లితెరపై ఆర్జేగా, యాంకర్‏గా గుర్తింపు తెచ్చుకుంది కాజల్. కానీ బిగ్ బాస్ రియాల్టీ షోతో ఎక్కువగా ఫేమస్ అయ్యింది. సీజన్ 5లోకి అడుగుపెట్టి తన ఆట తీరుతో బోలెడంత పాపులారిటీని సంపాదించుకుంది కాజల్. తాజాగా తన ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం కాజల్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతుంది.

RJ Kajal: నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. బిగ్ బాస్ కాజల్ ఎమోషనల్ పోస్ట్..
Rj Kajal
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2025 | 7:50 PM

Share

ప్రస్తుతం బుల్లితెరపై విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ఆర్జే కాజల్. బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత బుల్లితెరపై పలు షోలలో పాల్గొని సందడి చేసింది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా తన ఇన్ స్టాలో కాజల్ షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ తెగ వైరలవుతుంది. తన భర్త విజయ్ శీలం శెట్టికి బర్త్ డే విషెస్ చెబుతూ తమ జర్నీని రాసుకొచ్చింది. నా విజయ్ కు హ్యాపీ బర్త్ డే.. నువ్వు లేకుండా ఈ జీవితాన్ని ఊహించుకోలేను.. 2025 .. ఈ ఏడాదికి నా మనసులో ప్రత్యేమైన చోటు దక్కింది.. ఎందుకంటే మన జీవితంలోనే అత్యంత కీలకమైన మైలురాయి అయిన సొంతింటి కలను నెరవేర్చుకున్నాం అంటూ రాసుకోచ్చింది. ప్రస్తుతం కాజల్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

కాజల్ పోస్ట్ విషయానికి వస్తే.. “2025 నా హృదయంలో ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం, మేము మా జీవితంలోని అతిపెద్ద మైలురాళ్లలో ఒకదాన్ని దాటాము. మేము మా కలల ఇంటిని నిర్మించుకున్నాం. ఇంకా మేము మారలేదు. కానీ కలిసి అడుగువేయడం కోసం చేయి చేయి కలిపి మన కలను నిజం చేసుకున్నాము. ఒకప్పుడు చీకట్లు గుసగుసలాడుకునేవాళ్లం. ఇప్పుడవే గుసగుసలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంటే సంతోషంగా అనిపిస్తుంది. అలా అని మనమెప్పుడూ ఇంతో సంతోషంగా ఉండేవాళ్లం కాదు. మనం చాలాసార్లు గొడవ పడ్డాం. ఇంటీరియర్స్, రంగులు, కుషన్లు, సమయాల గురించి… కొన్నిసార్లు చాలా తెలివితక్కువ విషయాల గురించి గొడవ పెట్టుకున్నాం.

ఇవి కూడా చదవండి

కానీ మనకు ఒక రోజులో ఎన్ని గొడవలు వచ్చినా, ఎప్పటికీ మారని ఒక విషయం ఉంటుంది. మనం నిద్రపోయే ముందు దాన్ని ఎల్లప్పుడూ పరిష్కరించుకుంటాము. ప్రతి రాత్రి శాంతి, కౌగిలింతలు , మనకు ఉన్న ప్రేమ కంటే ఏ పోరాటం పెద్దది కాదనే నిశ్శబ్దమైన, చెప్పలేని అనుభూతితో ముగుస్తుంది. కొన్నిసార్లు పిచ్చివాళ్లలా నవ్వుకున్నాము. ఒకరినొకరు పట్టుకుంటాము. కొట్టుకుని అంతలోనే కలిసిపోయేవాళ్లం. మన బంధాన్ని మరింత ధృడంగా నిర్మించుకున్నాం. నువ్వులేని జీవితం ? అన్న ఆలోచనను కూడా నా దరిదాపుల్లోకి రానివ్వను. ఈ జీవితాంతం కలిసి ఉండడానికి, పక్కపక్కనే సమాధి కావాలని కోరుకోవడం గురించి మనం తరచుగా జోక్ చేసుకుంటూ ఉంటాము. అంత గొప్ప ప్రేమను మనం ఒకరికొకరం పంచుకున్నాం. నువ్వే నా ప్రపంచం.. నువ్వు నా కోసమే పుట్టావు. నా భర్తగా దొరికినందుకు థాంక్యూ ” అంటూ రాసుకొచ్చింది కాజల్.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..