Bigg Boss 7 Telugu: రాహుల్‌తో బ్రేకప్‌కు అసలు కారణం అదే.. అసలు విషయం చెప్పిన రతికా సిస్టర్
మొదటి రోజు నుంచి ఈ బ్యూటీ హౌస్ లో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనదైన గేమ్ స్ట్రాటజీతో ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే హౌస్ లో ఉన్న వారితో గొడవలు పెట్టుకుంటూ బాగానే పాపులర్ అయ్యింది. గేమ్ కంటే గొడవలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఇక విమర్శలు ఎక్కువ కావడంతో ప్రేక్షకులు ఓట్లు తక్కువ పడటంతో హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది.
బిగ్ బాస్ సీజన్ 7లో ఎక్కువగా వినిపించిన పేరు రతికా రోజ్. ఈ అమ్మడు అందంతో పాటు వివాదాలతో ఎక్కువగా పాపులర్ అయ్యింది. మొదటి రోజు నుంచి ఈ బ్యూటీ హౌస్ లో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనదైన గేమ్ స్ట్రాటజీతో ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే హౌస్ లో ఉన్న వారితో గొడవలు పెట్టుకుంటూ బాగానే పాపులర్ అయ్యింది. గేమ్ కంటే గొడవలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఇక విమర్శలు ఎక్కువ కావడంతో ప్రేక్షకులు ఓట్లు తక్కువ పడటంతో హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆతర్వాత తిరిగి హౌస్ లోకి పంపించారు. అయితే రతికా హౌస్ లోకి వెళ్లిన తర్వాత తన మాజీ ప్రియుడి గురించి కొన్ని ఆస్కతికర కామెంట్స్ చేసింది. అతడు పాటలు పాడుతాడని కామెంట్స్ చేయడంతో ఆమె మాజీ ప్రియడు సింగర్ అని అర్ధమయ్యింది.
ఆతర్వాత ఆ సింగర్ ఎవరో కాదు రాహుల్ సిప్లిగంజ్ అని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాహుల్ , రతికా కలిసున్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో రతికా చెప్పింది రాహుల్ సిప్లిగంజ్ గురించే అని కన్ఫామ్ చేసేసారు నెటిజన్స్. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో రాహుల్ దీని పై స్పందించాడు. రతికా పీ ఆర్ టీమ్ కావాలనే ఈ ఫోటోలను వైరల్ చేసి తనకు బ్యాడ్ నేమ్ తెస్తుందని అన్నాడు రాహుల్.
అయితే రతికా బయటకు వచ్చినప్పుడు కూడా దీనిపై స్పందించలేదు. ఇప్పుడు ఆమె తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకివెళ్ళింది. తాజాగా ఈ ఫొటోస్ పై రతికా చెల్లెలు స్పందించింది. ఆ ఫోటోలు రాహులే లీక్ చేశాడు అని ఆరోపిస్తుంది ఆమె. రతికా ఫోన్ తన దగ్గర లేదు. కనీసం మా దగ్గర కూడా లేదు. అలాంటప్పుడు ఆ ఫోటోలు మేమెందుకు లీక్ చేస్తాం.. వాళ్ళ ప్రైవేట్ ఫోటోలు అయితే రతికా దగ్గర లేదా రాహుల్ దగ్గర ఉంటాయి.. కాబట్టి రాహుల్ ఈ ఫోటోలు లీక్ చేసుంటాడు అంటూ కామెంట్స్ చేసింది. అలాగే రాహుల్ రతికా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. కానీ పెళ్ళికి ముందు రాహుల్ కండీషన్స్ పెట్టాడు. పెళ్లి తర్వాత రతికాను సినిమాల్లో నటించవద్దు అన్నాడు. ఇండస్ట్రీలోకి వెళ్లకూడదు అని చెప్పాడు. అది రతికాకు నచ్చలేదు. ఇద్దరు ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చాకే బ్రేకప్ చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఫోటోలు లీక్ అయితే రాహుల్ ఎందుకు అంత సీరియస్ గా రియాక్ట్ అయ్యాడో తెలియడం లేదు అని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.