- Telugu News Photo Gallery Cinema photos Uppena beauty Krithi Shetty has reduced movie offers in Tollywood
Krithi Shetty: ఈ సుందరి సోయగాలు అడవికాచిన వెన్నెలేనా..? కృతిశెట్టికి ఆఫర్లు కరువు
ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ కృతి శెట్టి. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఉప్పెన సినిమాలో కృతిశెట్టి లుక్ కు నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే దర్శక నిర్మాతలను కూడా ఈ అమ్మడు ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించింది.
Updated on: Nov 04, 2023 | 2:27 PM

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ కృతి శెట్టి. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

ఉప్పెన సినిమాలో కృతిశెట్టి లుక్ కు నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే దర్శక నిర్మాతలను కూడా ఈ అమ్మడు ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించింది.

ఉప్పెన సినిమాతో పాటు శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హిట్స్ అందుకుంది కృతి శెట్టి. ఆతర్వాత వరుసగా కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ బెడిసికొట్టాయి.

చివరిగా నటించిన కస్టడీ సినిమా కూడా నిరాశపరిచింది. దాంతో ఇప్పుడు కృతి శెట్టి ఆచితూచి అడుగులేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఏ సినిమాను అనౌన్స్ చేయలేదు.

ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమానులకు టచ్ లో ఉంటుంది. గ్లామర్ డోస్ పెంచేసి ఫోటో షూట్స్ వదులుతోంది. తాజాగా బ్లాక్ కలర్ చీరలో వయ్యారాలు వడ్డిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ చిన్నది.




