- Telugu News Photo Gallery Cinema photos Heroine Samantha Ruth Prabhu away from Tollywood news Goes Trending in social media Telugu Actress Photos
Samantha Ruth Prabhu: టాలీవుడ్ కు దూరం అవుతున్న సమంత.! సామ్ ఎక్కడ ఉన్నావ్,ఎప్పుడొస్తావ్.?
సమంతను చూస్తుంటే అంతా సెట్ అయిపోయినట్లే అనిపిస్తున్నారు.. ఎక్కడా అనారోగ్యంగా ఉన్నట్లు అయితే కనిపించడం లేదు. మరి ఇప్పుడైనా మళ్లీ సినిమాల్లోకి వచ్చేస్తారా లేదంటే ముందు చెప్పిన వన్ ఇయర్ కండీషన్‌కు కట్టుబడి ఉంటారా..? అదీ కాదంటే హాలీవుడ్ కోసం బాలీవుడ్‌ను వాడుకుంటూ.. టాలీవుడ్‌ను పక్కనబెట్టేస్తున్నారా..? అసలేం జరుగుతుంది..? సినిమాలు చేసినా చేయకపోయినా కొందరు హీరోయిన్లకు కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు.
Updated on: Nov 04, 2023 | 2:22 PM

సమంతను చూస్తుంటే అంతా సెట్ అయిపోయినట్లే అనిపిస్తున్నారు.. ఎక్కడా అనారోగ్యంగా ఉన్నట్లు అయితే కనిపించడం లేదు. మరి ఇప్పుడైనా మళ్లీ సినిమాల్లోకి వచ్చేస్తారా లేదంటే ముందు చెప్పిన వన్ ఇయర్ కండీషన్‌కు కట్టుబడి ఉంటారా..?

అదీ కాదంటే హాలీవుడ్ కోసం బాలీవుడ్‌ను వాడుకుంటూ.. టాలీవుడ్‌ను పక్కనబెట్టేస్తున్నారా..? అసలేం జరుగుతుంది..? సినిమాలు చేసినా చేయకపోయినా కొందరు హీరోయిన్లకు కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. సమంత కూడా ఇదే లిస్టులోకి వచ్చే హీరోయిన్.

కొన్నేళ్లుగా ఈమె పెద్దగా సినిమాలైతే చేయట్లేదు. 2023లో శాకుంతలం, ఖుషీతో వచ్చినా.. అవి కూడా ఎప్పుడో సైన్ చేసిన సినిమాలు. ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ ఒప్పుకోలేదు ఈ బ్యూటీ.

పైగా మయోసైటిస్ కారణంగా సినిమాలకు కూడా ఓ ఏడాది బ్రేక్ ఇచ్చారు. అనారోగ్యం కారణంగా చికిత్స కోసం అమెరికా వెళ్లిన స్యామ్.. అక్కడ్నుంచి ఇండోనేషియా, ఇస్తాంబుల్, ఇటలీ అంటూ చాలా దేశాలు తిరిగారు.

లైఫ్ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా కెప్టెన్ మార్వెల్ చిత్రానికి సీక్వెల్ అయిన ది మార్వెల్స్ తెలుగు ప్రమోషన్ స్యామ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌లో చాలా యాక్టివ్‌గా కనిపించారు సమంత.

పైగా బన్నీ, విజయ్ తనకు ఇన్‌స్పిరేషన్ అని తెలిపారు. సమంత ఫోకస్ అంతా ఇప్పుడు బాలీవుడ్‌పైనే ఉంది. ఫారెన్ నుంచి రాగానే ముంబైలోనే స్టే చేసారు స్యామ్. అక్కడే ఉండి రెండు మూడు రోజులు యాడ్ షూటింగ్ కూడా చేసారు.

అయితే సినిమాలకు మాత్రం నో అంటున్నారు. కావాలనే తెలుగు ఇండస్ట్రీకి దూరం అవుతున్నారా.. హాలీవుడ్, బాలీవుడ్ కోసం టాలీవుడ్‌కు దూరం అవుతున్నారేమో అనిపిస్తుంది సమంతను చూస్తుంటే..! ఇదే నిజమైతే స్యామ్‌ను ఇక తెలుగు సినిమాల్లో చూడటం కష్టమే.




