- Telugu News Photo Gallery Cinema photos Big bang update from kamal haasan indian 2 movie in Film industry Telugu Entertainment Photos
Indian 2 – Kamal Haasan: బిగ్ బ్యాంగ్‌తో.. భారతీయుడు ఈజ్ బ్యాక్.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ఇండియన్ 2.
భారతీయుడు ఈజ్ బ్యాక్ అంటూ బిగ్ బ్యాంగ్‌తో ల్యాండ్ అయింది భారతీయుడు 2 టీజర్. కమల్‌హాసన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఇండియన్ లెజెండ్స్ చేతుల మీదుగా ఇండియన్2కి ఇంట్రో రెడీ చేశారు మేకర్స్. ఫస్ట్ షాట్ నుంచే క్యూరియాసిటీని బిల్డప్ చేసే ప్రయత్నం కనిపించింది. సముద్రం, నౌక, విమానం అంటూ అంతా కాస్ట్‌లీ ఎఫైర్‌గా అనిపించింది. చకచక కదిలే విజువల్స్‌కి తోడు, కమ్ బ్యాక్ ఇండియన్ అంటూ సాగిన సాంగ్ ఆకట్టుకుంటుంది.
Updated on: Nov 05, 2023 | 8:25 AM

భారతీయుడు ఈజ్ బ్యాక్ అంటూ బిగ్ బ్యాంగ్‌తో ల్యాండ్ అయింది భారతీయుడు 2 టీజర్. కమల్‌హాసన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఇండియన్ లెజెండ్స్ చేతుల మీదుగా ఇండియన్2కి ఇంట్రో రెడీ చేశారు మేకర్స్.

ఫస్ట్ షాట్ నుంచే క్యూరియాసిటీని బిల్డప్ చేసే ప్రయత్నం కనిపించింది. సముద్రం, నౌక, విమానం అంటూ అంతా కాస్ట్‌లీ ఎఫైర్‌గా అనిపించింది. చకచక కదిలే విజువల్స్‌కి తోడు, కమ్ బ్యాక్ ఇండియన్ అంటూ సాగిన సాంగ్ ఆకట్టుకుంటుంది.

అది బ్లూటిక్ పొందినదే కమ్ బ్యాక్ ఇండియన్, అది ఆధార్ పొందినదే కమ్ బ్యాక్ ఇండియన్, కంపల్సరీ అయ్యినదే కమ్ బ్యాక్ ఇండియన్, అన్యాయం అలవాటే కమ్ బ్యాక్ ఇండియన్, ఏమార్పూ రావట్లే కమ్ బ్యాక్ ఇండియన్, ఏమనిషీ మారట్లే కమ్ బ్యాక్ ఇండియన్.. అంటూ లంచం పెరిగిన సొసైటీలోకి ఇండియన్ మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వాలని చెబుతున్న సబ్జెక్ట్ ఇది.

అప్పట్లో భారతీయుడు ఎంత పోరాటం చేసినా, సొసైటీలో ఏం మార్పు రాలేదని, ఇప్పుడు ఇండియన్ తిరిగి వస్తే మార్పు కనిపిస్తుందనే ఆశతో అందరూ కమ్ బ్యాక్ ఇండియన్ అంటున్నట్టు కాన్సెప్ట్ రివీల్ చేశారు.

సినిమాలో కీ రోల్స్ చేసిన యాక్టర్స్ అందరినీ ఎస్టాబ్లిష్ చేశారు. బ్రహ్మానందం, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింగ్, ఎస్.జె.సూర్య అంటూ ప్రతి ఒక్కరినీ ఎస్టాబ్లిష్ చేశారు. విజువల్స్ చాలా గ్రాండ్‌గా అనిపించాయి.

ఈ రేంజ్ ఎక్స్ పెక్ట్ చేయలేదని అంటున్నారు నెటిజన్లు. ఫస్ట్ షాట్, లాస్ట్ షాట్‌లో కమల్‌ని కేరక్టర్‌ని ఇంట్రస్టింగ్‌గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కనిపించింది. ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను.

భారతీయుడికి చావే లేదు అని కమల్ చెప్పే మాటలు లోకనాయకుడి ఫ్యాన్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. విజువల్స్ పరంగా, గ్రాండియర్ పరంగా ఫర్వాలేదు కానీ, సబ్జెక్ట్ పరంగా పెద్దగా కొత్తదనం ఏమీ లేదని అంటున్నారు మరికొందరు విమర్శకులు.




