Shanmukh Jaswanth: షణ్ముక్ కోసం రంగంలోకి ప్రముఖ న్యాయవాది దిలీప్ సుంకర.. గంజాయి కేసుపై ఏమంటున్నారంటే?
షణ్ముక్ గంజాయి తీసుకున్నట్టు వైద్యపరీక్షల్లో కూడా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి షణ్ముఖ్‌పై కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. మరోవైపు షణ్ముఖ్ సోదరుడు సంపత్‌పై ఇప్పటికే చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే షణ్ముఖ్ కేసును వాదించేందుకు రంగంలోకి దిగారు ప్రముఖ న్యాయవాది కల్యాణ్ దిలీస్ సుంకర
బిగ్ బాస్ రన్నరప్, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓ యువతి దాఖలు చేసిన చీటింగ్ కేసులో అతని సోదరుడు సంపత్ వినయ్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు డ్రగ్స్ తో పట్టుబడ్డాడు షణ్ముఖ్. దీంతో వెంటనేఅతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. షణ్ముక్ గంజాయి తీసుకున్నట్టు వైద్యపరీక్షల్లో కూడా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి షణ్ముఖ్‌పై కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. మరోవైపు షణ్ముఖ్ సోదరుడు సంపత్‌పై ఇప్పటికే చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే షణ్ముఖ్ కేసును వాదించేందుకు రంగంలోకి దిగారు ప్రముఖ న్యాయవాది కల్యాణ్ దిలీస్ సుంకర. ఈ సందర్భంగా షణ్ముక్ పై గంజా కేసు, మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ,ఆయన సోదరుడు సంపత్ వినయ్ కేసు నేను చూస్తున్నాను. షన్ను తండ్రి నా వద్దనే ఉన్నారు. షణ్ముక్ పై మీడియాలో వస్తున్న కథనాలకు వాస్తవానికి ఎటువంటి సంబంధం లేదు. అన్ని ఆధారాలు పోలీస్ వారికి సమర్పిస్తున్నాం. మరిన్ని వివరాలు విపులంగా తెలియజేస్తాను’ అంటూ ట్వీట్ చేశారు దిలీప్ సుంకర.
ఇదే కేసు విషయమై మీడియాతో మాట్లాడిన దిలీప్ సుంకర.. ‘పోలీసుల కోణంలో మాత్రమే కేసు నమోదు చేశారు. ఈ విషయాలను న్యాయస్థానం నిర్ధారించాల్సి ఉంటుంది. పోలీసులు షణ్ముఖ్ ను అరెస్ట్ చేసిన సమయానికి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? దీనికి సంబంధించిన సీసీ పుటేజీ ఉంది. గత కొన్నిరోజులుగా షన్ను ఇంటికి ఎవరెవరు వచ్చారు..? అనే ఆధారాలు ఉన్నాయి. పోలీసులు సేకరించిన ఆధారాలను బట్టి మా వద్ద ఉన్నప్రూఫ్స్‌ను కూడా కోర్టుకు అందిస్తాం’ అని అన్నారు. కాగా గత నాలుగేళ్లగా షణ్ముఖ్ కంపెనీకి లీగల్ అడ్వైజర్‌గా ఉన్నారు కల్యాణ్ దిలీప్ సుంకర
కల్యాణ్ దిలీప్ సుంకర ట్వీట్..
షణ్ముఖ్ తో కల్యాణ్ దిలీప్ సుంకర..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.