AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : నీ బాగోతం అంతా తెలుసు.. రమ్య మోక్షపై టాప్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..

రమ్య మోక్ష.. సోషల్ మీడియాలో ఈ పేరు తెలియని వారుండరు. అలేఖ్య చిట్టి పికిల్స్ తో ఎంతో పాపులర్ అయ్యింది. అయితే కొన్ని రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు ఎంతగా మారుమోగిందో చెప్పక్కర్లేదు. కొన్ని రోజుల క్రితం ఓ కస్టమర్ కు అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు సిస్టర్స్ నుంచి వచ్చిన ఓ ఆడియో లీక్ కావడంతో వీరి మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఇక ఇప్పుడు అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది రమ్య మోక్ష.

Bigg Boss 9 Telugu : నీ బాగోతం అంతా తెలుసు.. రమ్య మోక్షపై టాప్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..
Ramya Moksha
Rajitha Chanti
|

Updated on: Oct 25, 2025 | 1:18 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9.. ఇప్పుడు ఏడో వారం నడుస్తుంది. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. నిన్న అనారోగ్య సమస్యలతో ఆయేషా ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు మరో ఎలిమినేషన్ కు సమయం దగ్గరపడింది. అయితే ఇప్పటివరకు సోషల్ మీడియా లెక్కల ప్రకారం కళ్యాణ్, తనూజ అత్యధిక ఓటింగ్ తో టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఇక సాయి శ్రీనివాస్, రాము రాథోడ్, రమ్య మోక్ష డేంజర్ జోన్ లో ఉన్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురిలో అత్యంత తక్కువ ఓటింగ్ ఉంది రమ్య మోక్షకే. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లి.. తనూజను పర్సనల్ అటాక్ చేసింది. వెళ్లిన మొదటి రోజు నుంచి బ్యాక్ బీచింగ్ చేయడం.. పర్సనల్ అటాక్ చేయడంతో జనాల నుంచి విపరీతమైన నెగిటివీటిని మూటగట్టుకుంది. దీంతో రమ్యను ఎలాగైనా బయటకు పంపించాలని మిగత కంటెస్టెంట్లకు ఓటింగ్ గుద్దిపడేశారు. దీంతో ఇప్పుడు రమ్య మోక్ష డేంజర్ జోన్ లో ఉంది. అయితే బిగ్ బాస్ లెక్కల ప్రకారం రమ్య కాకుండా సాయి శ్రీనివాస్, రాము రాథోడ్ ఎలిమినేట్ అయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ గీత కృష్ణ .. బిగ్ బాస్ షోతోపాటు రమ్య మోక్ష పై సంచలన కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రీల్స్ చేసేటప్పుడు రమ్యను చూశానని.. రాజమండ్రికి వెళ్లినప్పుడు మంజీరా సరోవర్ అనే స్టార్ హోటల్‌‌లో ఉండేవాడినని.. ఆ హోటల్ కుర్రాళ్లకు చెప్పి ఆమె అడ్రస్ కనుక్కొండి అని చెప్పానని అన్నారు. రాజమండ్రిలో ఓ మటన్ కొట్టు ముందు నిలబడి వీడియో చేసిందని.. ఆ వీడియోను యూట్యూబ్ లో చూశానని.. ఆ త్రవాత మరో రీల్ చూశానని అన్నారు. ఒకసారి కారులో వెళ్తుండగా ఆమె చెప్పిన షాప్ కనిపించడంతో అక్కడికి తీసుకెళ్లమని డ్రైవర్‌కి చెప్పానని.. అక్కడే ఆ అమ్మాయి గురించి వివరాలు తెలుసుకున్నాని అన్నారు.

ఇక ఆ అమ్మాయి నంబర్ కనుక్కొని ఫోన్ చేశానని.. సినిమాల్లోకి నువ్వు బాగుంటావని.. కంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ కు రమ్మని చెబితే.. మొహమాట పడ్డ అమ్మాయి. మీరే మా ఇంటికి రండి సార్ అని పిలిచిందని అన్నారు. అలా వచ్చేటప్పుడు నీకు తెలిసినవాళ్లు తోడు తీసుకుని రమ్మని చెప్పాను. పళ్ల మధ్య గ్యాప్ పూరించాలని సలహా ఇచ్చాను. హైదరాబాద్ వస్తే చాలా మంచి డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయని.. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే నువ్వు బాగుంటావని చెప్పానని.. హోటల్ కు రాలేదని.. నెల తర్వాత చూస్తే ఆ అమ్మాయి రీల్స్ లో పళ్ల గ్యాప్ లేకుండా కనిపించిదని అన్నారు గీత కృష్ణ. ఇప్పుడు ఆ అమ్మాయి బిగ్ బాస్ కు వెళ్లేంత క్రేజ్ సంపాదించింది. కెరీర్ మీద ఫోకస్ చెయమని వాళ్ల అక్క చెప్పింది. అంతకు మించి ఏం అనలేదు. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన తర్వాత మంచి డ్రెస్ వేసుకుని పోస్ట్ పెట్టింది. దాని కింద వచ్చిన కామెంట్స్‌కి నేను సరదాగా కామెంట్ పెట్టాను. ముగ్గురు అక్కాచెల్లెళ్లు బాగుంటారు. బాగుండాలి. డ్యాన్స్ చేయాలి. యాక్ట్ చేయాలి. ఆ చీప్ దానితోటి నీకెంటి అంటున్నారు. ఎవరు చీప్ కాదిక్కడ.. పెద్ద పెద్ద డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూతుళ్లు కూడా వస్తున్నారు అంటూ గీతా కృష్ణ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?