Bigg Boss 8: అయ్యో పాపం.. బిగ్‏బాస్‏లోకి వచ్చిన ఒక్కరోజుకే ఎలిమినేట్.. గుక్కపెట్టి ఏడ్చిన కంటెస్టెంట్..

తెలుగులో బిగ్‏బాస్ సీజన్ 8 ఆరు వారాలకు చేరుకుంది. ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు ఆరో వారం నామినేషన్స్ ప్రక్రియ దగ్గరపడింది. అలాగే నిన్న హౌస్ లోకి అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పాత కంటెస్టెంట్స్ పై గురిపెట్టారు. ఒక్కొక్కరి తప్పొప్పులను చెబుతూ నామినేట్ చేస్తున్నారు.

Bigg Boss 8: అయ్యో పాపం.. బిగ్‏బాస్‏లోకి వచ్చిన ఒక్కరోజుకే ఎలిమినేట్.. గుక్కపెట్టి ఏడ్చిన కంటెస్టెంట్..
Sachana
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 07, 2024 | 7:40 PM

తెలుగులో బిగ్‏బాస్ సీజన్ 8 ఆరు వారాలకు చేరుకుంది. ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు ఆరో వారం నామినేషన్స్ ప్రక్రియ దగ్గరపడింది. అలాగే నిన్న హౌస్ లోకి అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పాత కంటెస్టెంట్స్ పై గురిపెట్టారు. ఒక్కొక్కరి తప్పొప్పులను చెబుతూ నామినేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అటు తమిళంలోనూ బిగ్‏బాస్ సీజన్ 8 అక్టోబర్ 6న అట్టహాసంగా ప్రారంభమైంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్న ఈ షోలోకి మొదటి రోజే మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది. ఈసారి హౌస్ లోకి సీనియర్ నటీనటులతోపాటు యంగ్ సెలబ్రెటీస్ కూడా అడుగుపెట్టారు. అయితే తమిళ్ బిగ్‏బాస్ రియాల్టీ షోలో అసలు ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టి 24 గంటలు కూడా పూర్తి కాకముందే ఎలిమినేషన్ చేశాడు.

తాజాగా విడుదలైన ప్రోమోలో మొదటి రోజు ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది చూపించారు. అందులో కోలీవుడ్ నటి సచన ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు బిగ్‏బాస్. దీంతో సచన ఏడుస్తూ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ అమ్మాయి ఇప్పుడిప్పుడే కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇటీవల విజయ్ సేతుపతి నటించిన మహారాజ మూవీలో నటించింది. ఇందులో మక్కల్ సెల్వన్ కూతురిగా కనిపించింది సచన. మహారాజా సినిమాతో తమిళంతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఇప్పుడు హౌస్ లోకి అడుగుపెట్టిన ఒక్కరోజుకే సచన ఎలిమినేట్ అయ్యిందని ప్రకటించాడు బిగ్‏బాస్. కనీసం వారం కూడా గడవకముందే ఎలిమినేట్ ఎలా చేశారు.. ? అసలు వన్ డే ఎలిమినేషన్ వెనుక మరేదైనా ప్లాన్ ఉందా ? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. గతంలో తమిళ్ బిగ్‏బాస్ షోలకు లోకనాయకుడు కమల్ హాసన్ హోస్టింగ్ చేశాడు. కానీ ఈసారి ఆ హీరో తప్పుకోవడంతో విజయ్ సేతుపతి హోస్టింగ్ చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.