Bigg boss 5 Telugu: గేమ్ గేమ్‌లా చూసుకోండి.. ఎక్కువ ఎమోషనల్ అవ్వకు.. సిరికి కౌంటర్ ఇచ్చిన షణ్ముఖ్ మదర్..
బిగ్ బాస్ హౌస్ లో అమ్మ ఎమోషన్స్ నడుస్తున్నాయి. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులను ఒకొక్కరిని పంపిస్తున్నాడు బిగ్ బాస్
Bigg boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో అమ్మ ఎమోషన్స్ నడుస్తున్నాయి. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులను ఒకొక్కరిని పంపిస్తున్నాడు బిగ్ బాస్. ఈ క్రమంలో కాజల్ భర్త కూతురు రాగా.. శ్రీరామ్ సిస్టర్, సన్నీ మదర్, సిరి మదర్, మానస్ మదర్, ప్రియాంక చెల్లి మధు, రవి ఫ్యామిలీ, షన్ను మదర్ ఎంట్రీ ఇచ్చారు. నిన్నటి ఎపిసోడ్ లో రవి భార్య, కూతురు హౌస్ లోకి వచ్చారు. భార్య, కూతురిని చూసిన రవి ఎమోషనల్ అయ్యాడు. ఆతర్వాత కూతురితోకలిసి హౌస్ లో ఆటలాడాడు.. అబద్దాలు ఆడకు.. గుర్తుండకపోతే వదిలేయ్ అంటూ రవికి తన భార్య నిత్య సలహాలు ఇచ్చింది. ఇక సన్నీ అమ్మ హౌస్ లో సందడి చేశారు. బిగ్ బాస్ ఇంట్లో నీకు చెల్లి దొరికింది అని కాజల్‌ను, మంచి ఫ్రెండ్ దొరికాడు అని మానస్ గురించి కళావతి చెప్పారు. అందరు బాగా ఆడుతున్నారు. అందరు మంచిగా ఉండాలి అని అన్నారు కళావతి. ఆతర్వాత ప్రియాంక చెల్లి మధు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
కేవలం ఆట మీద మాత్రమే ఫోకస్ పెట్టు అంటూ హింట్ ఇచ్చింది. తలదించుకునే పనులు చేయను అని నాన్నకు మాటిచ్చావ్ కదా దాన్ని నిలబెట్టుకోమని చెప్పాడు అంటూ ప్రియాంకకు చెప్పింది. ఆ తరువాత రవి ఫ్యామిలీ వచ్చింది. మొదట రవి భార్య నిత్య మాత్రమే వస్తుంది. ఆ తరువాత వియా కూడా ఎంట్రీ ఇస్తుంది. దీంతో రవి ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి. శ్రీరామచంద్ర మామా, సిరిబు (సిరి అత్త) అని వియా ముద్దుగా పిలిచింది. మమ్మీ ఏడ్చింది డాడీ.. తాత కూడా ఏడ్చాడు అని నిత్య క్యూట్‌గా తన తండ్రి రవికి చెబుతుంది. వియాతో మిగతా కంటెస్టెంట్లు ఆడుకున్నారు. లోపల రవి, నిత్యలు మాట్లాడుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ అంకుల్ ఎక్కడున్నారు అంటూ వియా ఇళ్లంతా వెతికింది. వెళ్లేటప్పుడు వియా ఏడ్చేసింది.చివరకు షన్ను మదర్ ఉమా రాణి షన్ను బాబు అనుకుంటూ హౌస్ లోకి వచ్చారు. నా బాండ్ ఎవరితో బాగుంది.. రవితోనా? సిరితోనా? అని షన్ను అడుగుతాడు. అందరితో ఉండు.. ఒకరితోనే ఉండకు.. అని చెప్పారు. దీప్తిని కలిశావా..? అని అడుగుతాడు. కలిస్తే ఏంటి? అని కౌంటర్ వేస్తారు ఉమా రాణి. శ్రీరామచంద్ర పాటలు బాగుంటాయ్.. సన్నీ ఆట బాగుంది.. మానస్ థింకింగ్ బాగుంటుందని అన్నారు. నీ కోసం నువ్ ఆడు.. ఎవరు అలిగినా కూడా వెళ్లి ఎమోషనల్ అవ్వకు.. అని చెప్పుకొచ్చారు. గేమ్ గేమ్‌లా చూసుకోండి.. ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి.. అలగడం మానేయండి.. బాగా లేదు.. నవ్వుతూనే ఉండండి.. అప్పుడే బాగుంటుంది.. అని సలహా ఇచ్చారు .
మరిన్ని ఇక్కడ చదవండి :