Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda : రికార్డుల మోత మోగాల్సిందే.. డిసెంబర్‌ 2 కోసం ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్..

నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని అఖండ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీ‌ను, బాలయ్య కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

Akhanda : రికార్డుల మోత మోగాల్సిందే.. డిసెంబర్‌ 2 కోసం ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్..
Akhanda
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 26, 2021 | 8:30 PM

Akhanda : నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని అఖండ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీ‌ను, బాలయ్య కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సింహ, లెజెండ్‌‌లతో నట సింహం బాలయ్య కెరీర్‌లో మైల్ స్టోన్స్‌లాంటి సినిమాలను అందించిన బోయపాటి.. ఇప్పుడు అఖండగా హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పవర్ ఫుల్ స్టోరీతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయారు. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోలో గర్జించనున్నారు. నందమూరి అభిమానుల ప‌ల్స్ తెలిసిన బోయ‌పాటి ఈ సినిమాలో బాలయ్య‌ను ఇంతకు ముందెన్నడూ చూడని స‌రికొత్త‌పాత్ర‌లో చూపిస్తుండడంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనివుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆకట్టుకోవడమే కాదు అఖండ ట్రైలర్‌ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.

రౌద్రానికి మోడల్లా.. వీరత్వానికే హడల్లా.. ఆవేశంతో ఊగిపోతున్న బాలయ్య ను చూసి అందరూ తెగ ఫిదా అవుతున్నారు. టీవీల్లో.. మొబైల్ ఫోన్లలో ట్రైలర్‌ చూస్తూ ఈలలు… గోలలతో ఎంజాయ్‌ చేస్తున్నారు. అఖండ డైలాగులు చెబుతున్న తీరుకు గగుర్పాటుకు లోనవుతున్నారు. బాలయ్య కు తిరిగులేదు… రికార్డులను హద్దూ అదుపు లేదంటూ.. సోషల్ మీడియాలో కమెంట్లతో రెచ్చిపోతున్నారు.. యూట్యూబ్‌లో కిర్రాక్‌ వ్యూస్‌ తో ట్రెండింగ్‌లో నిలుపుతున్నారు.  ఇక ఈ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజైన భం! భం! అఖండ సాంగ్ ఈ ట్రైలర్‌ ఫీల్‌ను కొనసాగిస్తూ.. సినిమా పై విపరీతమైన అంచనాలను పెంచేస్తున్నాయి. భం! భం! అఖండా అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. రోమాలను నిక్కబొడిచేలా చేస్తోంది. థమన్‌ మ్యూజిక్.. బాలయ్య మ్యాజిక్‌తో ఈ సాంగ్ య్యూటూబ్‌ను షేక్‌చేస్తోంది. ఇక ఈ సాంగ్ చూసిన బాలయ్య అభిమానులు.. డిసెంబర్‌ 2 థియేటర్లవైపే చుస్తూన్నారు. సినిమా రిలీజ్‌ కోసం వెయిట్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Janani Song : ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్ వచ్చేసింది.. సినిమా మొత్తానికి సోల్ ఈ పాట..

Keerthy Suresh: చీరకట్టులో మెరిసిపోతున్న నేటి ‘మహానటి’.. ‘కీర్తీసురేష్’ లేటెస్ట్ ఫోటోస్..

Ritu Varma: తెలుగు అమ్మాయి రీతూ వర్మ అందాలు.. చందమామ అయినా చిన్నబోవాల్సిందే..(ఫొటోస్)