AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda: బాలయ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మరో సర్ ప్రైజ్.. ప్రత్యేక అతిథిగా ఆయన కూడా..

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'అఖండ'. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి

Akhanda: బాలయ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మరో సర్ ప్రైజ్.. ప్రత్యేక అతిథిగా ఆయన కూడా..
Basha Shek
| Edited By: Anil kumar poka|

Updated on: Nov 27, 2021 | 5:41 PM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘అఖండ’. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కలయికలో ‘సింహ’, ‘లెజెండ్’, వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘అఖండ’తో హ్యాట్రిక్ హిట్‌ కొట్టేందుకు రెడీగా ఉన్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్లు, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేశాయి. శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండడం ఈ సినిమాలో ఉన్న మరో విశేషం. డిసెంబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం కోసం చిత్రబృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసింది.

ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. శనివారం( నవంబర్ 27)న హైదరాబాద్  శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్‌ జరగనుంది. కాగా ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్‌ గెస్ట్ గా హాజరు కానున్న సంగతి తెలిసిందే. కాగా ఇదే కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథిగా రానున్నారని తెలిసింది. దీంతో నందమూరి అభిమానులు మరింత ఖుషి అవుతున్నారు. మరోవైపు బాలయ్య, అల్లు అర్జున్‌, రాజమౌళిలను ఒకే వేదికపై చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:

Sree Leela : నవ్వే నిండు చందమామ.. ఈ పుత్తడిబొమ్మ.. అందాల శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్..

Ramya Krishna: తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా శివగామి!.. కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న ఆసక్తికర వార్త..

Akhanda : రికార్డుల మోత మోగాల్సిందే.. డిసెంబర్‌ 2 కోసం ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్..