Ramya Krishna: తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా శివగామి!.. కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న ఆసక్తికర వార్త..

లోకనాయకుడు కమల్‌హాసన్‌ కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో తమిళంలో ఆయన హోస్ట్‌గా ప్రసారమయ్యే ప్రముఖ రియాలిటీ షో 'బిగ్‌బాస్‌ సీజన్‌ 5' కు ఇపుడు తాత్కాలికంగా కొత్త హోస్ట్‌ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..

Ramya Krishna: తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా శివగామి!.. కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న ఆసక్తికర వార్త..
Follow us
Basha Shek

|

Updated on: Nov 26, 2021 | 8:33 PM

లోకనాయకుడు కమల్‌హాసన్‌ కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో తమిళంలో ఆయన హోస్ట్‌గా ప్రసారమయ్యే ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 5’ కు ఇపుడు తాత్కాలికంగా కొత్త హోస్ట్‌ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కమల్‌హాసన్‌ స్థానంలో ఆయన కూతురు శ్రుతిహాసన్‌ వ్యాఖ్యాతగా రానున్నారని వార్తలు వచ్చాయి. ఆమెతో పాటు సూర్య, శింబు, విజయ్‌ సేతుపతి..తదితర ప్రముఖుల పేర్లు వినిపించాయి. అయితే శ్రుతినే హోస్ట్‌గా వస్తుందని చాలామంది భావిస్తోన్న తరుణంలో మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. టాలీవుడ్‌ ‘శివగామి’ రమ్యకృష్ణే తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ఎంపికయ్యారన్న విషయం కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.

ప్రస్తుతం’ బిగ్‌బాస్‌’ ప్రసారం అవుతున్న ఛానల్‌లో రమ్యకృష్ణ ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేసింది. ఇక తెలుగులో నాగ్ హోస్ట్ చేస్తోన్న బిగ్‌బాస్‌లో ఓసారి హోస్ట్‌గా వచ్చి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీనికి తోడు కొత్తవారిని హోస్ట్‌గా ఎంపిక చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉందని, ఇది షో రేటింగ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపే ఉందని బిగ్‌బాస్‌ నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే అనుభవం ఉన్న రమ్యకృష్ణనే వారు సంప్రదించారని తెలుస్తోంది. రమ్య కూడా ఇందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని.. ఈ వీకెండ్‌లో ఆమెనే షోకు హోస్ట్‌గా వస్తుందని తమిళ జనాలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే తన ప్రజెన్స్‌తో టాలీవుడ్‌ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న రమ్య..తమిళ బిగ్‌బాస్‌ను కూడా సక్సెస్‌ ఫుల్‌గా నడిపిస్తుందని భావిస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Also Read:

Akhanda : రికార్డుల మోత మోగాల్సిందే.. డిసెంబర్‌ 2 కోసం ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్..

Pragya Jaiswal: బాలకృష్ణ గారు చాలా సీనియర్.. ఆయన నడిచి వస్తుంటే.. సెట్ అంతా సైలెంట్..

Samantha: ఈ ఏడాది ఎలా గడిచిందన్న ప్రశ్నకు సమంత ఆసక్తికర సమాధానం.. వైరల్‌ అవుతోన్న వీడియో..

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల