Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pragya Jaiswal: బాలకృష్ణ గారు చాలా సీనియర్.. ఆయన నడిచి వస్తుంటే.. సెట్ అంతా సైలెంట్..

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Pragya Jaiswal: బాలకృష్ణ గారు చాలా సీనియర్.. ఆయన నడిచి వస్తుంటే.. సెట్ అంతా సైలెంట్..
Pragya Jaiswal
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 26, 2021 | 8:18 PM

Pragya Jaiswal: నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ.. నటిగా మారాలని అనుకున్నప్పుడే మంచి పాత్రలను చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ నా వరకు వచ్చిన కథల్లోంచి మంచి కారెక్టర్‌లను ఎంచుకున్నాను. అందులో కొన్ని వర్కవుట్ అవుతాయి. కొన్ని కావు. ఫలితం మనం చేతుల్లో ఉండదు. కానీ నేను మాత్రం మంచి పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాను అన్నారు. బాలకృష్ణ గారు చాలా సీనియర్. అంత పెద్ద హీరోతో నేను ఇది వరకు ఎప్పుడూ కలిసి నటించలేదు. ఆయనది టైం అంటే టైం. ఇది వరకు ఆయన రెండు మూడు సార్లు కలిశాను. కానీ ఆయనతో మొదటి రోజు పని చేస్తున్నాని తెలియడంతో ఎంతో నర్వస్‌గా ఫీలయ్యాను. కానీ కలిసిన ఐదు నిమిషాల్లోనే ఎంతో కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చేశారు. ఆయనలాంటి పాజిటివ్ పర్సన్‌ను నేను ఇంత వరకు చూడలేదు అన్నారు. ఆయన అలా నడిచి వస్తుంటే.. సెట్ అంతా సైలెంట్ అవుతుంది. క్రమశిక్షణ, సమయపాలనలో ఆయన గ్రేట్. ఆయనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను.

ఇది వరకు చూసిన ప్రగ్యా కనిపించొద్దని బోయపాటి గారు అన్నారు. ఆ పాత్రను పోషించేందుకు చాలా కష్టపడ్డాను. ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు. నాకు బోయపాటి గారి మీద చాలా నమ్మకం ఉంది. ఆయక ఒక పాత్ర కోసం ఒకరిని అనుకున్నారంటే అది కచ్చితంగా పర్ ఫెక్ట్ చాయిస్‌లా ఉంటుంది. ఆయన ఎంతో ఆలోచించి గానీ ఒక పాత్రకు ఆర్టిస్ట్‌ను ఎంచుకోరు. ఆయనకు ఎలాంటి వారు కావాలి.. సినిమాను ఎలా తీయాలి అనేది బాగా తెలుసు. అందుకే ఈ సినిమా కోసం నన్ను అడిగినప్పుడు మొత్తం కథ వినకుండానే ఓకే చెప్పాను. నాకు ఆయన మీద ఆ నమ్మకం ఉంది అన్నారు ప్రగ్యా.

బాలకృష్ణ గారు, బోయపాటి గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. అఖండ లాంటి కథ, అలాంటి కారెక్టర్ నేను ఇంత వరకు చూడలేదు. ఇక్కడే అని కాదు. ఇతర భాషల్లోనూ అలాంటి పవర్ ఫుల్ పాత్రను నేను చూడలేదు. బాలకృష్ణ గారు ఆ పాత్రలో డిఫరెంట్ లెవెల్‌లో కనిపిస్తారు. ఉదయాన్నే మూడు గంటలకు లేస్తారు.. ఆరు గంటలకే సెట్‌కు వస్తారు.. రోజంతా షూటింగ్ చేస్తారు.. మీరు మనిషేనా? అని అడిగేశాను. బాలకృష్ణ గారు అంత పవర్ ఫుల్ వ్యక్తి కావడంతోనే బోయపాటి గారు అఖండ లాంటి పాత్రను రాశారేమో.. అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Keerthy Suresh: చీరకట్టులో మెరిసిపోతున్న నేటి ‘మహానటి’.. ‘కీర్తీసురేష్’ లేటెస్ట్ ఫోటోస్..

Ritu Varma: తెలుగు అమ్మాయి రీతూ వర్మ అందాలు.. చందమామ అయినా చిన్నబోవాల్సిందే..(ఫొటోస్)

Nivetha Pethuraj: న్యూ ఫోటోస్ తో ఆకట్టుకుంటున్న నివేత పేతురాజ్.. వరుస సినిమాలతో బిజీగా ముద్దుగుమ్మ..