Bigg boss 3 Telugu: శిల్ప చక్రవర్తి ఎలిమినేట్
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్ సీజన్3’. నాగార్జున హోస్ట్‌గా చేస్తోన్న బిగ్‌బాస్ 3..ముందు నుంచి కాంట్రవర్సీలతో ఆడియెన్స్‌లో ఆసక్తి రేపుతూ వస్తోంది. ఈ షో ఇప్పటికే 57 ఎఫిసోడ్లు పూర్తయింది. కాగా ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరవుతారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. ఇటీవల వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన యాంకర్, నటి శిల్ప చక్రవర్తి ఎలిమినేట్ అయ్యారు. శిల్ప రాకతో బిగ్‌బాగ్ షో మరింత ఆసక్తికరంగా మారుతుందని అందరూ […]

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్ సీజన్3’. నాగార్జున హోస్ట్‌గా చేస్తోన్న బిగ్‌బాస్ 3..ముందు నుంచి కాంట్రవర్సీలతో ఆడియెన్స్‌లో ఆసక్తి రేపుతూ వస్తోంది. ఈ షో ఇప్పటికే 57 ఎఫిసోడ్లు పూర్తయింది. కాగా ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరవుతారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు.
ఇటీవల వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన యాంకర్, నటి శిల్ప చక్రవర్తి ఎలిమినేట్ అయ్యారు. శిల్ప రాకతో బిగ్‌బాగ్ షో మరింత ఆసక్తికరంగా మారుతుందని అందరూ భావించారు. అయితే, ఆ స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన రాలేదు. హౌస్‌లోకి ప్రవేశించిన తొలివారం నామినేషన్ ప్రక్రియ నుంచి మినహాయింపు లభించగా, ఆ మరుసటి వారమే ఆమె నామినేట్ కావడం విశేషం. శిల్పతో పాటు శ్రీముఖి, హిమజ, మహేశ్ విట్టా, పునర్నవిలు కూడా నామినేట్ అయ్యారు. అయితే, ప్రేక్షకుల నుంచి శిల్పకు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున వెల్లడించారు.
ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నాగార్జున హౌస్ మేట్స్‌కు మంచి టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా శ్రీముఖి, శిల్పాచక్రవర్తిలకు ఇచ్చిన టాస్క్ హౌస్‌లో నవ్వులు పూయించింది. ముఖ్యంగా శ్రీముఖి.. మగ గొంతుతో మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. మరోవైపు మహేష్ విట్టా.. శ్రీముఖిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన తీరు నవ్వు తెప్పించింది. మరోవైపు శ్రీముఖి, వితిక షేరు, బాబా భాస్కర్ తిరుమల ఎపిసోడ్ కూడా హౌస్‌లో మంచి ఎంటర్టైన్‌మెంట్ ఇచ్చింది. కాగా ఇప్పటివరకూ బిగ్‌బాస్ సీజన్3లో ఎలిమినేట్ అయిన వారందరూ తొలిసారి నామినేట్ అయిన సభ్యులే కావడం గమనార్హం.