రౌడీ హీరోయిన్ ‘ఓనమ్’ ట్రీట్.. నెటిజన్లు ఫిదా!

రౌడీ హీరోయిన్ 'ఓనమ్' ట్రీట్.. నెటిజన్లు ఫిదా!

మాళవిక మోహనన్… ప్రస్తుతానికి ఈ పేరు తెలుగువారికి తెలియకపోవచ్చు కానీ తొందర్లోనే టాలీవుడ్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. రౌడీ విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘హీరో’తో ఈ మలయమారుతం పరిచయం అవుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యూ. మోహనన్ కుమార్తయిన మాళవిక మలయాళంతో పాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. తాజాగా రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘పెటా’ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఈమె ప్రేక్షకులకు దగ్గరగా […]

Ravi Kiran

|

Sep 16, 2019 | 11:33 AM

మాళవిక మోహనన్… ప్రస్తుతానికి ఈ పేరు తెలుగువారికి తెలియకపోవచ్చు కానీ తొందర్లోనే టాలీవుడ్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. రౌడీ విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘హీరో’తో ఈ మలయమారుతం పరిచయం అవుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యూ. మోహనన్ కుమార్తయిన మాళవిక మలయాళంతో పాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. తాజాగా రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘పెటా’ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఈమె ప్రేక్షకులకు దగ్గరగా ఉండటం కోసం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది.

మలయాళ భామలు ఓనమ్ పండుగను సంబరంగా జరుపుకుంటారు. అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్, పార్వతి నాయర్, మడోన్నా సెబాస్టియన్ వంటి వారు కేరళ ట్రేడ్ మార్క్ శారీలతో ముచ్చటైన ఫోజులిచ్చి తమ ఇన్‌స్టాగ్రామ్‌ను నింపేస్తారు. ఇప్పుడు అదే కోవలో మాళవిక మోహనన్ కూడా ఓనమ్ మార్క్ హాఫ్ వైట్ శారీలో దోసిలిలో పూలతో నవ్వుతూ.. మరోఫోటోలో తన కొంటె చూపుతో ఫ్యాన్స్ మనసులను దోచుకుంటూ..ఇక చివరి ఫోటోలో జడను సవరించుకుంటున్నట్లుగా పోజిచ్చింది.. ఇక ఈ పోజులో నెటిజన్లందరికి పవన్ కళ్యాణ్ ఖుషి ఇంటర్వెల్ ఎపిసోడ్ ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఆ ఫోటో చూసిన వాళ్లకు.. రవివర్మ గీసిన చిత్రమా.. లేక ఎల్లోరా శిల్పమా అనేలా కనిపిస్తుంది.

మరోవైపు ఈ ఓనమ్ ట్రీట్ పిక్స్‌కు నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “ఉఫ్..కట్టింగ్ ఎడ్జ్”.. “స్టన్నింగ్ ఓనం ట్రీట్”.. “అందుకే నాకు కేరళ ఇష్టం” అంటూ ఒక నెటిజన్ స్పందించగా.. ,మరొకరు “కెఎల్ రాహుల్ తో జాగ్రత్త” అంటూ సూచనలు ఇచ్చాడు. ఏది ఏమైనా ఈ పిక్స్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

View this post on Instagram

Kerala saree love ♥️

A post shared by Malavika Mohanan (@malavikamohanan_) on

View this post on Instagram

🌺 . . HMU @makeupartistkarishmabajaj ♥️ Fairy godmother @theitembomb ♥️ 📸 @jayslens

A post shared by Malavika Mohanan (@malavikamohanan_) on

View this post on Instagram

Wishing all of you a very happy Onam! ✨🌺

A post shared by Malavika Mohanan (@malavikamohanan_) on

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu