కామెడీ అంటే కిశోర్..కిశోర్ అంటే కామెడీ!

కామెడీ అంటే కిశోర్..కిశోర్ అంటే కామెడీ!
Vennele Kishore

వెన్నెల కిశోర్..ఈ నేమ్‌కు టాలీవుడ్ ఇండష్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. కామెడీకి కొత్త భాష్యాన్ని చెప్తూ..సినిమాల్లో చెరగని నవ్వులు పంచుతున్నాడు ఈ టైమింగ్ ఉన్న కమెడియన్.  సందేహ‌మే లేదు. ఇప్పుడు టాలీవుడ్ క‌మెడియ‌న్ల‌లో నంబ‌ర్ వ‌న్ వెన్నెల కిషోరే. అస‌లు పోటీ ఇచ్చే వాళ్లు కూడా ద‌రిదాపుల్లో క‌నిపించ‌డం లేదు. బ్ర‌హ్మానందం జోరు త‌గ్గిపోయాక చాలామంది క‌మెడియ‌న్లు వ‌స్తున్నారు, వెళ్తున్నారు. కానీ కిషోర్‌లా క‌న్సిస్టెంట్‌గా క‌డుపుబ్బ న‌వ్విస్తున్న క‌మెడియ‌న్ మ‌రొక‌రు క‌నిపించ‌రు. ఒక సినిమా ఫ‌లితం […]

Ram Naramaneni

|

Sep 16, 2019 | 6:21 AM

వెన్నెల కిశోర్..ఈ నేమ్‌కు టాలీవుడ్ ఇండష్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. కామెడీకి కొత్త భాష్యాన్ని చెప్తూ..సినిమాల్లో చెరగని నవ్వులు పంచుతున్నాడు ఈ టైమింగ్ ఉన్న కమెడియన్.  సందేహ‌మే లేదు. ఇప్పుడు టాలీవుడ్ క‌మెడియ‌న్ల‌లో నంబ‌ర్ వ‌న్ వెన్నెల కిషోరే. అస‌లు పోటీ ఇచ్చే వాళ్లు కూడా ద‌రిదాపుల్లో క‌నిపించ‌డం లేదు. బ్ర‌హ్మానందం జోరు త‌గ్గిపోయాక చాలామంది క‌మెడియ‌న్లు వ‌స్తున్నారు, వెళ్తున్నారు. కానీ కిషోర్‌లా క‌న్సిస్టెంట్‌గా క‌డుపుబ్బ న‌వ్విస్తున్న క‌మెడియ‌న్ మ‌రొక‌రు క‌నిపించ‌రు. ఒక సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా.. వెన్నెల కిషోర్ ఉన్నాడంటే.. కొన్ని న‌వ్వులు గ్యారెంటీ.  చాలా మామూలు పాత్ర‌ల్లో కూడా త‌న‌వైన హావ‌భావాలు, పంచుల‌తో న‌వ్వించ‌గ‌ల నైపుణ్యం కిషోర్ సొంతం. కిశోర్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటే సినిమా మినిమమ్ గ్యారెంటీ అనే టాక్ ఇప్పుడు ఆడియెన్స్‌ నుంచి వినిపిస్తోంది.

స్రీన్‌పై కనిపించినంతసేపు ఏదో ఒకలా నవ్వించడానికే ప్రయత్నం చేస్తుంటాడు ఈ క్రేజీ కమెడియన్. తనకు డైలాగ్ లేకున్నా మేనరిజమ్స్ చేస్తూ..ఓ తింగరితనంతో కూడిన బాడీ లాంగ్వేజ్‌ స్రీన్ ప్రజన్స్ అదరగొడతాడు. అతడిపై ఎక్కువ ట్రాక్‌లు వేసుకోని హిట్టు కొట్టిన దర్శకులు లేరంటే అతిశయోక్తి కాదు. సరైన పాత్రలు రాయాలే గానీ..తెరపై అద్బుతాలు చేస్తాడు కిశోర్..అందుకు అతడి తాజా సినిమానే ఉదాహారణ.

తాజాగా గ్యాంగ్ లీడ‌ర్‌లో అటు ఇటుగా ప‌ది నిమిషాలే క‌నిపించిన కిషోర్‌.. అంత త‌క్కువ స‌మ‌యంలోనే ప్రేక్ష‌కుల‌కు గిలిగింత‌లు పెట్టేశాడు. ఇందులో అత‌డి పాత్ర పేరు.. సంతూర్ సెన‌క్కాయల కావ‌డం విశేషం. ఇందులో అత‌ను మ‌గాళ్లంటే ప‌డి చ‌చ్చే వ్య‌క్తిగా క‌నిపించాడు. బ్యాంకులో సెక్యూరిటీ వ్య‌వ‌స్థ‌ను ప‌ర్య‌వేక్షించే ఆఫీస‌ర్ అయిన కిషోర్ ద‌గ్గ‌రికి ఓ ప‌ని మీద వెళ్తాడు నాని. ఆ సంద‌ర్భంలో ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు మామూలుగా పేల‌లేదు. కిషోర్ మేన‌రిజ‌మ్స్.. అత‌డి డైలాగులు.. ఊప్స్ అనే అత‌డి ఊత‌ప‌దం.. చ‌క్కిలిగింత‌లు పెడ‌తాయి. హ‌డావుడి లేకుండా స‌టిల్ యాక్టింగ్‌తో కిషోర్ ఈ స‌న్నివేశాల్ని పండించిన తీరు అమోఘం. కిషోర్‌కు కిషోరే సాటి అని గ్యాంగ్ లీడ‌ర్ సినిమాతో మ‌రోసారి రుజువైంది. ఏది ఏమైనా బ్రహ్మనందం, సునీల్ తర్వాత..వారి రేంజ్‌లో వారికి భిన్నమైన టిపికల్ క్యాటగిరీలో అదరగొడుతున్నాడు ఈ కామెడీ చిన్నోడు. ముందు ముందు కిశోర్ మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులను నవ్వించాలని కోరుకుందాం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu