Bhagavanth Kesari 1st Day Collections: ‘భగవంత్ కేసరి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాలయ్య, శ్రీలీల సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే..
భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది. రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన ఈ సినిమా.. ఎట్టకేలకు నందమూరి అభిమానులకు తెగ నచ్చేసింది. ఇక తాజా సమాచారం ప్రకారం మొదటి రోజు ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. బాలయ్య సినిమాకు ఓపెనింగ్ గట్టిగానే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘భగవంత్ కేసరి’. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంటితో యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటించగా.. బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించింది. ఇక బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలకపాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది. రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన ఈ సినిమా.. ఎట్టకేలకు నందమూరి అభిమానులకు తెగ నచ్చేసింది. ఇక తాజా సమాచారం ప్రకారం మొదటి రోజు ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. బాలయ్య సినిమాకు ఓపెనింగ్ గట్టిగానే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నివేదికల ప్రకారం ఈ సినిమా మొదటి రోజు రూ.57 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. దీంతో ఈ సినిమా సుమారు రూ.68.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1350 థియేటర్లలో విడుదలైంది. సినిమా విడుదలకు మూడు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ.14 నుంచి 15 కోట్లు రేంజ్ లో ఓపెనింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే దేశీయ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.20 కోట్లు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. కాగా భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన అఫీషియల్ లెక్కలు మాత్రం ఇంకా రావాల్సి ఉంది.
View this post on Instagram
ఇక భగవంత్ కేసరి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.57 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వాటిలో నైజాం నుంచి రూ.14.50 కోట్లు.. సీడెడ్ రూ. 13 కోట్లు.. ఉత్తరాంధ్ర రూ.8 కోట్లు.. ఈస్ట్ గోదావరిలో రూ.5 కోట్లు.. వెస్ట్ గోదావరిలో రూ.4 కోట్లు.. గుంటూరు నుంచి రూ.6 కోట్లు.. కృష్ణాలో రూ.4 కోట్లు.. నెల్లూరు నుంచి రూ.2.6 కోట్లు ఉన్నాయని సమాచారం. అలాగే కర్ణాటకతోపాటు మిగిలిన రాష్ట్రాల్లో రూ.4.25 కోట్లు.. ఓవర్సీస్ రూ. 6 కోట్లు బిజినెస్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా రూ.67 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
