AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NBK107 : స్పీడ్ పెంచిన బాలయ్య.. శరవేగంగా NBK107 షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న బాలయ్య.. తన కెరీర్ లో తొలిసారి 200 కోట్ల క్లబ్ లోకి చేరారు

NBK107 : స్పీడ్ పెంచిన బాలయ్య.. శరవేగంగా NBK107 షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..
Nbk 107
Rajeev Rayala
|

Updated on: Jul 20, 2022 | 5:25 PM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న బాలయ్య.. తన కెరీర్ లో తొలిసారి 200 కోట్ల క్లబ్ లోకి చేరారు. బోయపాటి దర్శకత్వం వహించిన అఖండ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గోపిచంద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న గోపీచంద్ బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్స్, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో బాలయ్య సరసన పొడుగు కాళ్ళ సుందరి శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ మూవీ షూటింగ్ ఇటీవలే తెలంగాణ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఆతర్వాత చిత్రయూనిట్ అంతా టర్కీకి పయనమయ్యారు. అక్కడ కొన్ని సీన్స్ తో పాటు పాటలను చిత్రీకరించారని తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ కూడా షూటింగ్ ముగించుకొని నెక్స్ట్ షెడ్యూల్ కు సిద్ధం అవుతోంన్త బాలయ్య సినిమా. NBK 107 సినిమా షూటింగ్ ను ఇప్పుడు కర్నూల్ లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో  నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆమె పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని టాక్. గతంలో గోపీచంద్ తెరకెక్కించిన క్రాక్ సినిమాలో జయమ్మ గా వరలక్ష్మి భయపెట్టిన విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us