Akhanda : బాలయ్య క్రేజా మజాకా.. తమిళ్ తంబీలకు కూడా ఇక పూనకాలే పూనకాలు
నటసింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ మూవీ అఖండ సినిమా విజయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య నట విశ్వరూపంతో అఖండ సినిమా అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
Akhanda : నటసింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ మూవీ అఖండ సినిమా విజయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య నట విశ్వరూపంతో అఖండ సినిమా అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. గతంలో ఈ ఇద్దరి కాంబోలో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చాయి ఈ సినిమా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వచ్చిన అఖండ సినిమా ఊహించని రీతిలో సంచలన విజయాన్ని అందుకుంది. అఖండ మూవీ థియేటర్ల వద్ధ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో బాలయ్య ఏకంగా 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు. మరోవైపు ఈ సినిమా ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక జనవరి 21న ఈ చిత్రాన్ని ఓటీటీలోనూ విడుదల చేశారు. ఓటీటీలో విడుదలైన 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో అత్యధిక వ్యూస్ సాధించిన రికార్డ్ సృష్టించింది అఖండ. బాలయ్య.. బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ఈ మూవీ.. అటు వెండితెరపైనే కాకుండా.. ఇటు ఓటీటీలోనూ అఖండ విజయం సాధించింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేయడానికి పోటీ పడుతున్నారు ఇతర బాషా దర్శక నిర్మాతలు. ఇప్పటికే బాలీవుడ్ లో ఈ సినిమా రీమేక్ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో అఖండ సృష్టించిన సునామీ, దీనికి తోడు ఓటీటీలోనూ అఖండ రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతుండడంతో బాలీవుడ్ మేకర్స్ అఖండను రీమేక్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. దీంతో అఖండను బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి ఇద్దరు స్టార్ హీరోలు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు అక్షయ్ కుమార్ కాగా, మరొకరు అజయ్ దేవగణ్. వీరిద్దరికి మాస్ హీరోలుగా మంచి క్రేజ్ ఉంది. మరో వైపు కోలీవుడ్ లో ఈ సినిమాకు క్రేజ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అఖండ సినిమాను తమిళ్ లోకి డబ్ చేసి అక్కడ భారీగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఈ మేరకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది. మరి తమిళ తంబీలను అఖండ ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :