AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yandamuri Veerendranath : మరో సినిమా మొదలుపెట్టిన యండమూరి వీరేంద్రనాధ్.. ఈ సారి సునీల్ హీరోగా..

ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. "నల్లంచు తెల్లచీర" సినిమాకు షూటింగ్ కు  ఇటీవల గుమ్మడికాయ కొట్టిన..

Yandamuri Veerendranath : మరో సినిమా మొదలుపెట్టిన యండమూరి వీరేంద్రనాధ్.. ఈ సారి సునీల్ హీరోగా..
Rajeev Rayala
|

Updated on: Jul 24, 2021 | 5:21 PM

Share

ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. “నల్లంచు తెల్లచీర” సినిమాకు షూటింగ్ కు ఇటీవల గుమ్మడికాయ కొట్టిన యండమూరి… తాజాగా “అతడు-ఆమె-ప్రియుడు” చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు.  సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ హీరోలుగా… మహేశ్వరి వడ్డి- ప్రియాంక-సుపూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  “అతడు… ఆమె ప్రియుడు’ చిత్రాన్ని… సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది ఈ క్రేజీ ప్రాజెక్ట్. “మొన్న చాటింగ్… నిన్న డేటింగ్… ఈరోజు మేటింగ్… రేపు….?’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ తో మొదలైన ముహూర్తపు సన్నివేశానికి “మాతృదేవోభవ” ఫేమ్ అజయ్ కుమార్ క్లాప్ కొట్టగా.. మెగా బ్రదర్ నాగబాబు కెమెరా స్విచాన్ చేశారు. ప్రఖ్యాత దర్శకులు కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అంబికా రాజా ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. నటుడిగా తన  ప్రస్థానం “రాక్షసుడు” చిత్రంతోనే మొదలైందని ఈ సందర్బంగా యండమూరి గుర్తు చేసుకున్నారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప రచయితల్లో ఒకరైన యండమూరి దర్శకత్వంలో రూపొందుతున్న “అతడు..ఆమె.. ప్రియుడు” అసాధారణ విజయం సాధించి… దర్శకుడిగానూ ఆయన పేరు మారుమ్రోగాలని నాగబాబు అన్నారు. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌‌‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bichagadu 2 : తొలిసారి మెగాఫోన్ పట్టనున్న విజయ్ ఆంటోని.. ఆసక్తికరంగా బిచ్చగాడు2 పోస్టర్..

Ravi Teja Khiladi: రవితేజ సినిమాపై వస్తున్న రూమర్స్‌‌‌‌‌‌కు చెక్ పెట్టేసిన మేకర్స్..

Arya and Sayyeshaa: కోలీవుడ్ హీరో ఆర్య ఇంట సంబరాలు.. పండంటి పాపకు జన్మనిచ్చిన సాయేషా..