Arya and Sayyeshaa: కోలీవుడ్ హీరో ఆర్య ఇంట సంబరాలు.. పండంటి పాపకు జన్మనిచ్చిన సాయేషా..

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య తండ్రయ్యారు. ఆయన భార్య, హీరోయిన్ సాయేషా పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్నీ హీరో విశాల్ సోషల్ మీడియా

Arya and Sayyeshaa: కోలీవుడ్ హీరో ఆర్య ఇంట సంబరాలు.. పండంటి పాపకు జన్మనిచ్చిన సాయేషా..
Arya
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 24, 2021 | 3:05 PM

Arya and Sayyeshaa: కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య తండ్రయ్యారు. ఆయన భార్య, హీరోయిన్ సాయేషా పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని హీరో విశాల్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఈ సంతోషకర విషయాన్ని అభిమానులతో పంచుకున్న విశాల్.. నా బ్రదర్ ఆర్య తండ్రయ్యాడు. సాయేషా పాపకు జన్మనిచ్చింది. నేను బాబాయిని అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. వాళ్లకి అంతా మంచే జరగాలని.. ఆ పాపకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. నేను షూటింగ్ మధ్యలో ఉన్నాను.. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను అంటూ.. విశాల్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇక ఆర్య సాయేషా ప్రేమించి పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. తమిళ్ తోపాటు ఆర్యకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది.

ఆయన నటించిన రాజా రాణి, ఆట ఆరంభం, నేనే అంబానీ, వాడు వీడు, సైజ్ జీరో సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక బన్నీ నటించిన వరుడు సినిమాలో ఆర్య విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు. ఇక సాయేషా కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. అక్కినేని అఖిల్ మొదటి సినిమాలో సాయేషా హీరోయిన్ గా నటించింది. ఇక ఆర్య తాజా చిత్రం ‘సార్పట్ట’ ఓటీటీవేదికగా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. బుల్లితెర పైనా దమ్ము చూపించాడు.. గుర్తుపట్టండి ఎవరో..

రాజ్ కుంద్రా కేసులో శిల్పా శెట్టి వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు..5 గంటల పాటు ‘విచారణ’

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!