రాజ్ కుంద్రా కేసులో శిల్పా శెట్టి వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు..5 గంటల పాటు ‘విచారణ’

తన భర్త రాజ్ కుంద్రా కేసులో శిల్పా శెట్టి వాంగ్మూలాన్ని ముంబై క్రైమ్ బ్రాంచి పోలీసులు నమోదు చేశారు. ముంబై జుహూ లోని ఆమె ఇంటిపై శిఉక్రవారం సాయంత్రం దాడి చేసిన పోలీసులు ఆమెను రాత్రి సుమారు 5 గంటలపాటు విచారించినట్టు తెలిసింది.

రాజ్ కుంద్రా కేసులో శిల్పా శెట్టి వాంగ్మూలం నమోదు చేసిన  పోలీసులు..5 గంటల పాటు 'విచారణ'
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jul 24, 2021 | 12:52 PM

తన భర్త రాజ్ కుంద్రా కేసులో శిల్పా శెట్టి వాంగ్మూలాన్ని ముంబై క్రైమ్ బ్రాంచి పోలీసులు నమోదు చేశారు. ముంబై జుహూ లోని ఆమె ఇంటిపై శిఉక్రవారం సాయంత్రం దాడి చేసిన పోలీసులు ఆమెను రాత్రి సుమారు 5 గంటలపాటు విచారించినట్టు తెలిసింది. ఆమె రాజ్ కుంద్రా ఆర్ధిక లావాదేవీలు, అతని పోర్న్ చిత్రాలకు సంబంధించిన సమాచారంపై వారు ఆరా తీశారు. 2019 నుంచి కుంద్రా తీసిన 100 పోర్న్ చిత్రాలకు సంబంధించి టెరాబైట్స్ లో ఉన్న కంటెంట్ ను స్వాధీనం చేసుకుని దాన్ని విశ్లేషిస్తున్నారు. వియాన్ అనే కంపెనీని కుంద్రా నిర్వహించాడని, ఒకప్పుడు దానికి తాను డైరెక్టరుగా ఉన్నా ఆ తరువాత రాజీనామా చేశానని శిల్పాశెట్టి చెప్పినట్టు తెలిసింది. వియాన్ కంపెనీ ద్వారా కుంద్రా కెర్నిన్ అనే మరో సంస్థను కూడా నిర్వహించాడని దాని ద్వారా కూడా ఆర్థిక లావాదేవీలు జరిపేవాడని తెలియవచ్చింది. ఎస్ బ్యాంకు లోను, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికాలోను కుంద్రాకు అకౌంట్లు ఉన్నాయి. ఈ రెండు కంపెనీల నుంచి ఈ ఖాతాలకు సొమ్ము వెళ్ళేదట.. అలాగే మెర్క్యురీ ఇంటర్నేషనల్ అనే క్రికెట్ బెట్టింగ్ సంస్థ నుంచి సైతం ఈ ఖాతాలకు డబ్బు ట్రాన్స్ ఫర్ అయ్యేదని సమాచారం. పోలీసులు ఈ అన్ని అంశాల పైనా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

ఈ నెల 27 వరకు కుంద్రా పోలీసు కస్టడీని కోర్టు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇతనితో బాటు ర్యాన్ తోర్పే అనే ఇతని సహచరుడిని కూడా వారు అరెస్టు చేశారు. ఇంత జరిగినా తాను తప్పేమీ చేయలేదని వాదిస్తున్న కుంద్రా తన అరెస్టు చట్ట విరుద్ధమంటూ బాంబేహైకోర్టు కెక్కాడు. ఇక శిల్పా శెట్టి తన కొత్త సినిమా’హంగామా-2′ ఓటీటీలో రిలీజయిందని , కుటుంబ సభ్యులంతా కలిసి కూచుని దీన్ని చూడాలని అంటూ తన ఇన్స్ టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. 14 ఏళ్ళ తరువాతజ ఈమె నటించిన చిత్రమిది. 2007 లో అప్నే చిత్రంలో ఈమె నటించింది.

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch: వాన కష్టం వరద నష్టం.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 అత్యాశకు పోతే అంతే ఉంటది మరి..!ఇన్సూరెన్స్‌ డబ్బు ఆశతో బెంజ్‌ కారు తగులబెట్టిన వ్యక్తి..:Benz car Video.

 యజమాని కోసం పిల్లి చేసిన సాహసం..పాముతో ఫైట్ చేసి మరి యజమానికి ముప్పు తప్పించింది..వీడియో:Cat Fight With Snake Video.

 ఐదు కొమ్ములతో అరుదైన గొర్రె..!ఎందుకిలా..?యుగాంతానికి సంకేతమా..?:sheep has 5 horns Video.

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?