Prabhas: ఎట్టకేలకు సెట్స్ పైకి ప్రభాస్ కొత్త సినిమా.. పూజా కార్యక్రమాలకు వచ్చిన అమితాబ్..

ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే రెబల్ స్టార్ అభిమానులు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే

Prabhas: ఎట్టకేలకు సెట్స్ పైకి ప్రభాస్ కొత్త సినిమా.. పూజా కార్యక్రమాలకు వచ్చిన అమితాబ్..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 24, 2021 | 2:02 PM

ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే రెబల్ స్టార్ అభిమానులు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంగతి తెలిసందే. ఎన్నోసార్లు.. సోషల్ మీడియా ద్వారా డైరెక్టర్ నాగ్ అశ్విన్‏ను అప్‏డేట్స్ ఇవ్వండి అంటూ మొరపెట్టుకున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రభాస్ చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా చిత్రాలే. అయితే నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే మూవీ ఇంటర్నేషనల్ లెవల్‏లో ఉండబోతుందని డైరెక్టర్ ప్రకటించిన రోజు నుంచి ఈ సినిమాలో అంచనాలు భారీగానే పెరిగాయి. అయితే ఈ సినిమా అంతకంతకు ఆలస్యమవుతునే వచ్చింది. ఇందులో కేవలం టాలీవుడ్ తారలు మాత్రమే కాకుండా… బాలీవుడ్‏లో బడా స్టార్స్ నటించబోతుండడం.. సైంటిఫిక్ ఫిక్షన్.. వరల్డ్ లెవల్ మూవీ అని నాగ్ అశ్విన్ ప్రకటించడంతో ఈ కాంబోలో వచ్చే సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

అయితే ఎట్టకేలకు ప్రభాస్ అభిమానుల అశలు ఫలించాయి. ఎన్నో రోజులు ఎదురుచూస్తున్న ఈ సినిమా ఈరోజు (శనివారం) హైదరాబాద్‏లో రామోజీ ఫిల్మ్ సిటిలో ప్రారంభమయ్యింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాల్గోన్నాడు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇంకా బయటకు రాలేదు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తుంది. మొత్తానికి ఎప్పటినుంచో అభిమానులు ఎదురుచూస్తున్న మూవీ సెట్స్ పైకి వచ్చేసింది. ఇక ప్రస్తుతం ప్రభాస్.. ఆదిపురుష్, సలార్, రాధేశ్యామ్ సినిమాలు చేస్తున్నాడు. ఇవి మూడు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.

ట్వీట్..

Also Read: Aamir Khan: విడిపోయారు.. కానీ కలిసే కనిపిస్తున్నారు.. అర్థం కానీ అమీర్ ఖాన్, కిరణ్ రావు తీరు.. వీడియో వైరల్..

Personal Loan Limit: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వ్యక్తిగత రుణాల పరిమితిని పెంచుతూ ప్రకటన.. కానీ వారికి మాత్రమే..!